మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
x
Highlights

హైదరాబాద్‌ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్, ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుని ఎంతో మంది రోగులు ప్రాణాలు కోల్పోయ్యారు. అయితే అదే ట్రాఫిక్‌లో...

హైదరాబాద్‌ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్, ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుని ఎంతో మంది రోగులు ప్రాణాలు కోల్పోయ్యారు. అయితే అదే ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ రోగిని కాపాడేందుకు కానిస్టేబుల్‌ సాహసం చేశాడు. ట్రాఫిక్ లో అంబులెన్స్ ముందు పరిగెడుతూ రోగి ప్రాణాలు కాపాడాడు. దాంతో పోలీస్ అంటే ఏంటో చూపించాడు. అంబులెన్స్‌కు అడ్డుగా ఉన్న వాహనదారులను రెక్వెస్ట్ చేస్తూ లైన్ క్లియర్ చేశాడు. ఇది ఎక్కడో కాదు నిత్యం రద్దీగా ఉండే మొజంజాహి- కోఠి రూట్‌లో జరిగింది.

అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో బాబ్జీ అనే కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడు మొజంజాహి మార్కెట్‌ దగ్గర విధులు నిర్వహిస్తున్నాడు. సాయంత్రం సమయంలో ట్రాఫిక్ ఫుల్ ఉండడంతో వాహనాలను క్రమంగా క్లియర్ చేస్తున్నాడు. అయితే అదే సమయంలో అక్కడకు ఒక అంబులెన్స్ వచ్చింది. వాహనం లోపల రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్న బాబ్జీ దాని ముందు పరుగెడుతూ వాహనాదారులను పక్కకు జరిపారు. అంబులెన్స్ లో ఉన్న రోగి సరైన సమయంలో ఆస్పత్రికి చేరడంతో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు.

కానిస్టేబుల్ బాబ్జీ పరుగెతున్న సమయంలో అంబులెన్స్ లో ఉన్న రోగి బంధువులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ వారిని కాపాడి శభాష్ పోలీస్ అనిపించుకున్నాడు బాబ్జీ.. కానిస్టేబుల్ చేసిన సమయస్పూర్తికి పోలీస్ ఉన్నతాధికారులతో పాటు, నెటిజన్‌లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ మానవత్వాన్ని చాటుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories