Street Dogs: హైదారాబాద్‌లో వీధికుక్కలకు కరోనా లక్షణాలు

Hyderabad Street Dogs Have Coronavirus Symptoms
x

వీధి కుక్కలకు కరోన (ఫైల్ ఫోటో)

Highlights

Street Dogs: కేబీఆర్ పార్కు సమీపంలో శునకాలు జ్వరం,దగ్గు, జలుబు లక్షణాలు..ఉన్నాయి. రోడ్లపై పడిపోతూ వున్నాయి.

Street Dogs: యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి ఇపుడు జంతువుల పై కూడా పంజా విసురుతోంది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లోని ఎనిమిది సింహాలలో కరోనా లక్షణాలు కన్పించడం అందరిని షాక్‌కు గురి చేసింది. దీంతో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) అధికారులు ఈ సింహాలకు నిర్వహించిన ఆర్‌టీ పీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్‌ తేలడంతో జూపార్క్‌కు వచ్చే సందర్శకులకు అనుమతి నిరాకరించారు. తాజాగా నగరంలోని వీధి కుక్కలలో కోవిడ్ లక్షణాలు కన్పించడం ఇప్పుడు నగరవాసుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి.

బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు సమీపంలో కుక్కలు నీరసంగా కనిపిస్తున్నాయి. శునకాలకు జ్వరం దగ్గు జలుబు లక్షణాలు..ఉన్నాయి. రోడ్లపై పడిపోతూ.. నీరసంగా కనిపిస్తూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయి కుక్కలు. దీంతో వాటిని చూసి స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై ప్రభుత్వం చొరవ తీసుకుని జంతువులకు పరీక్షలు నిర్వహించి జంతువుల్లో కరోనా వ్యాప్తిని అరికట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories