Hyderabad Rains: అర్థరాత్రి హైదరాబాద్ లో దంచికొట్టిన వాన..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

Rain Alert IMD has announced that there will be heavy rains in Telangana and AP for two days
x

 Rain Alert: ఒక్క వర్షానికే హైదరాబాద్‎లో నరకం.. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు

Highlights

Hyderabad Rains:హైదరాబాద్ లో మంగళవారం అర్థరాత్రి కుండపోత వాన పడింది. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షానికి చాలా చోట్ల రోడ్లన్నీజలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వచ్చిన వర్షం బీభత్సం స్రుష్టించింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లింగంపల్లి, పటాన్ చెరు, చందానగర్, కొండాపూర్, గచ్చిబౌలి, మల్కాజ్ గిరి, చర్లపల్లి,కీసర, కాప్రా, నాగారం, దమ్మాయిగూడ, తిరుమలగిరి, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జీడిమెట్ల,కూకట్ పల్లి, ప్రగతి నగర్, బేగంపేట, అమీర్ పేట, బంజారాహిల్స్, పంజాగుట్ట, మలక్ పేట, సైదాబాద్, కోఠి అబిడ్స్, ఎల్బీనగర్, హయత్ నగర్, అల్వాల, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, సుచిత్ర, కోంపల్లి, బొల్లారం, తోపాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేవారు. కాలనీల్లో వరద ఇబ్బందులు లేదా విపత్కర పరిస్థితులు ఉంటే 040-21111111 లేదా 9000113667 నెంబర్లను సంప్రదించాలని సూచించారు అధికారులు

మరోవైపు సెప్టెంబర్ 5వ తేదీన పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకోని మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవన ధ్రోణి ప్రభావంతో కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇక తెలంగాణలోనూ పలు జిల్లాల్లో నేడు భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతం వైపు పయనిస్తుందని ఐఎండీ తెలిపింది. నేడు కొమురంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories