Attack On Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి.. హోటల్లో 50 గదుల్లో బస చేసిన నిందితులు?

Attack On Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి.. హోటల్లో 50  గదుల్లో బస చేసిన నిందితులు?
x
Highlights

Attack On Secunderabad Muthyalamma Temple : సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన కేసులో కీలకమైన...

Attack On Secunderabad Muthyalamma Temple : సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన కేసులో కీలకమైన అంశాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒక నిందితుడుని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆ నిందితుడు కీలకమైన వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తనతో పాటు దాడికి పాల్పడిన వ్యక్తులు సికింద్రాబాద్ లోని ఓ హోటల్లో బస చేసినట్లుగా నిందితుడు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. అతడు ఇచ్చిన వివరాల ఆధారంగా హోటల్ పై దాడిచేసిన పోలీసులు.. అక్కడ 3, 4 అంతస్తుల్లో భారీ సంఖ్యలో దుండగులు దాదాపు 50 గదుల వరకు అద్దెకి తీసుకున్నట్లు తెలుసుకున్నారు.

సికింద్రాబాల్ మెట్రో పోలీస్ హోటల్లో బస చేసిన సలీం సల్మాన్ థాకూర్ అనే వ్యక్తి మసీద్‌కి వెళ్లే క్రమంలో దారి మధ్యలో ముత్యాలమ్మ ఆలయంపై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆలయంపై దాడి జరుగుతుండటాన్ని స్థానికులు చూసి బిగ్గరగా అరుస్తూ అక్కడికి పరుగెత్తుకు రావడంతో వారు పారిపోయినట్లు తెలిపారు. ఆలయంపై దాడి అనంతరం హోటల్లో బసచేసిన వాళ్లంతా పారిపోయినట్లు పోలీసులు స్పష్టంచేశారు.

హోటల్ నుండి నిందితులు పారిపోయినప్పటికీ.. అక్కడి రిసెప్షన్ లో ఉన్న రికార్డులు, సీసీ కెమెరాల ఫుటేజ్, ఐడెంటిటీ కార్డ్స్ కింద ఇచ్చిన ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటి ఆధారంగా త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని హైదరాబాద్ పోలీసులు స్పష్టంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories