హురున్ తాజా జాబితా ప్రకారం వేల కోట్ల సంపద ఉన్నవారు హైదరాబాద్‌లో 104 మంది ఉన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.
వేల కోట్ల రూపాయల సంపన్నులు కొలువైన టాప్-3 ఇండియన్ సిటీస్‌లో హైదరాబాద్ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది. తాజాగా విడుదలైన ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2024’ 386 మంది బిలియనేర్లతో ముంబై దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 217 మంది సంపన్నులతో న్యూదిల్లీ రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాన్ని హైదరాబాద్ సొంతం చేసుకుంది. నిజానికి, ఈ లిస్టులో ఇంతకుముందు బెంగళూరు థర్డ్ ప్లేసులో ఉండేది. ఈసారి బెంగళూరును కిందకు నెట్టి హైదరాబాద్ మూడో స్థానానికి వచ్చింది.
హైద్రాబాద్ లో అత్యంత సంపన్నులు 104 మంది
హురున్ తాజా జాబితా ప్రకారం వేల కోట్ల సంపద ఉన్నవారు హైదరాబాద్‌లో 104 మంది ఉన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. 2020లో హైదరాబాద్ వేల కోట్ల సంపద కలిగిన వారి సంఖ్య 50 మాత్రమే. నాలుగేళ్ళ ఈ సంఖ్య రెట్టింపైంది. 2023లోని 87 నుంచి ఈ సంఖ్య 2024 నాటికి 104కు చేరింది.
దివీస్ లేబొరేటరీ వ్యవస్థాపకులు మురళి దివి.. ది రిచెస్ట్!
ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ లాబోరేటరీస్ వ్యవస్థాపకులు మురళి దివి, అతని కుటుంబ సభ్యులు సంపద ఈ ఏడాది 76,100 కోట్లకు చేరింది. దేశంలోని సంపన్నుల జాబితాలో ఆయన 26వ స్థానంలో నిలిచారు. హైద్రాబాద్ లో ఆయన టాప్ లో ఉన్నారు.
ఈ ఏడాది మురళి కుటుంబం సంపద 37 శాతం పెరిగింది. అయితే అదే సమయంలో ఆయన గతంతో పోలిస్తే నాలుగు స్థానాలకు పడిపోయారు. నిర్మాణ రంగంలో ఉన్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన పి.పిచ్చిరెడ్డి, పివికృష్ణారెడ్డిలు రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. పి. పిచ్చిరెడ్డి 54,800 కోట్లతో రెండో జాబితాలో నిలిచారు. పీవీ కృష్ణారెడ్డి 52,700 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆస్తులు 47 శాతం పెరిగాయి.
అయితే వీరిద్దరూ గతంతో పోలిస్తే రెండు స్థానాలను కోల్పోయారు. హెటిరో ల్యాబ్స్ వ్యవస్థాపకులు బి. పార్థసారథి రెడ్డి 29,900 కోట్లతో దేశంలోని 100 మంది సంపన్నుల జాబితాలో ఉన్నారు. తెలంగాణలో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 37 శాతం పెరిగింది. అయితే ఆలిండియా స్థాయిలో గతంతో పోలిస్తే ఆయన ఒక్క ర్యాంక్ కోల్పోయారు.
ఇండియాలో వెయ్యి కోట్లున్న సంపన్నులు 5 వేల మంది
దేశంలో వెయ్యి కోట్ల సంపద ఉన్న వ్యక్తులు 5 వేల మంది ఉండవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే, ఈసారి అదానీ కంపెనీ అధినేత గౌతమ్ అదానీ దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీనీ బీట్ చేసి మొదటి స్థానానికి చేరారు.
హురున్ జాబితా ప్రకారం అదానీ సంపద 11,61,800 కోట్ల రూపాయలు. ముకేశ్ అంబానీ సంపద 10,14,700 కోట్లు. మూడో స్థానంలో రూ. 3 లక్షల కోట్లతో హెచ్.సి.ఎల్ అధినేత శివనాడార్ నిలిచారు.
బాలీవుడ్ రిచెస్ట్ స్టార్ షారుఖ్ ఖాన్
ఈసారి హురున్ ఇండియాస్ రిచెస్ట్ జాబితాలోకి సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని కూడా ఆయిన షారుఖ్ రూ. 7,300 కోట్లతో బాలీవుడ్ స్టార్స్ లిస్టులో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో నటి జుహీ చావ్లా ఉన్నారు. ఆమె సంపద రూ. 4,600 కోట్లు.
తెలుగు కుబేరులు వీళ్ళే...
అపర్ణ కన్ స్ట్రక్షన్స్ సంస్థకు ఎస్. సుబ్రమణ్యం రెడ్డి 22,100 కోట్లతో హైద్రాబాద్ సంపన్నుల జాబితాలో 5 స్థానంలో నిలిచారు. ఇండియాలోని సంపన్నుల జాబితాలో ఆయన 134 ర్యాంక్ దక్కించుకున్నారు. ఇదే సంస్థకు చెందిన సి. వెంకటేశ్వర రెడ్డి హైద్రాబాద్ లో 6వ ర్యాంకులో నిలిచారు.
21,900 కోట్లతో ఇండియాలోని ధనవంతుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు ఎం సత్యనారాయణ రెడ్డి కుటుంబం సంపద 18,500 కోట్లు. దీంతో ఈ సంస్థ హైద్రాబాద్ లో 7వ స్థానంలో ఉంది. ఆలిండియా సంపన్నుల జాబితాలో 151వ స్థానాన్ని ఆయన దక్కించుకున్నారు.
మైహోమ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు జూపల్లి రామేశ్వరరావు 18,400 కోట్లతో 8వ స్థానంలో ఉన్నారు. ఆలిండియా జాబితాలో 153 స్థానంలో నిలిచారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ కె. సతీష్ రెడ్డి కుటుంబానికి 18,100 కోట్ల సంపద ఉంది. ఆలిండియాలో వీరి ర్యాంక్ 156, హైద్రాబాద్ లో వీరు 9వ స్థానంలో ఉన్నారు. 13,600 కోట్లతో బయోలాజికల్ ఇ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల హైద్రాబాద్ సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో నిలిచారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire