MMTS Trains: 15 నెలల తర్వాత పట్టాలెక్కిన ఎంఎంటీఎస్‌ రైళ్లు

Hyderabad MMTS Trains Started
x

MMTS Trains: 15 నెలల తర్వాత పట్టాలెక్కిన ఎంఎంటీఎస్‌ రైళ్లు

Highlights

MMTS Trains: సుమారు 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్‌ రైళ్లు పట్టాలెక్కాయి.

MMTS Trains: సుమారు 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. ఈ మేరకు తొలిదశలో కేవలం పది ట్రైన్లు మాత్రమే నడువనున్నాయి. ఉదయం 7.50 గంటలకు ప్రారంభమైన ఎంఎంటీఎస్‌ రాత్రి 7.05 నిమిషాల వరకు నడవనున్నాయి. విద్యార్థులకు సంబంధించిన పాస్‌లు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. తప్పనిసరిగా ప్రయాణికులు కొవిడ్ నిబంధనలు పాటించాలని రైల్వే అధికారులు సూచించారు. విధిగా మాస్కులు ధరించడంతో పాటు తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.

ఇక న‌గ‌దు ర‌హిత‌, కాంటాక్ట్‌లెస్ విధానంలో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికుల‌కు బ‌హుమ‌తి ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక‌లు వేస్తున్నారు. అన్ని ప్రధాన ఎంఎంటీఎస్ స్టేషన్లలో లభించే ATVMల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులకు 3 శాతం బోనస్ చెల్లింపులు అదనపు ప్రయోజనం లభిస్తుంది. అన్‌రిజ‌ర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ మొబైల్ యాప్ ద్వారా ఎమ్‌ఎమ్‌టిఎస్ టికెట్లను కొనుగోలు చేసే వారు యాప్‌లో లభించే ఆర్-వాలెట్ ద్వారా చెల్లించాలనుకుంటే అదనంగా 5 శాతం బోనస్ లభిస్తుందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories