Hyderabad Metro: ఇకపై మరింత స్పీడ్‌గా మెట్రో రైలు.. ప్రయాణికులకు సమయం ఆదా..

Hyderabad Metro Rail Journey to Get Faster
x

Hyderabad Metro: ఇకపై మరింత స్పీడ్‌గా మెట్రో రైలు.. ప్రయాణికులకు సమయం ఆదా..

Highlights

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైళ్ల వేగం మరింతగా పెరగనుంది.

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైళ్ల వేగం మరింతగా పెరగనుంది. ప్రస్తుతం గంటలకు 80 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెడుతున్న మెట్రో రైళ్లు ఇకపై గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఫలితంగా మోట్రో ప్రయాణికులకు మరింత సమయం ఆదా కానుంది. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ CMRS నుంచి రైళ్ల వేగం పెంపునకు అనుమతి లభించింది. మార్చి 28, 29, 30 తేదీల్లో మెట్రో ట్రైన్ స్పీడ్, సెక్యురిటీని అధికారులు తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా మెట్రో రైళ్ల వేగం, భద్రతపై CMRS అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా మెట్రో రైళ్ల వేగాన్ని గంటకు మరో 10 కిలోమీటర్లు పెంచుకునేందుకు కూడా హైదరాబాద్ మెట్రోలకు అనుమతించారు. దీంతో నాగోలు - రాయదుర్గం మధ్య 6 నిమిషాల ప్రయాణ సమయం, మియాపూర్‌ - ఎల్బీనగర్‌ మధ్య 4 నిమిషాలు, జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మధ్య 1.5 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories