Hyderabad: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

Hyderabad Metro Rail
x

Hyderabad Metro Rail

Highlights

Metro Google Wallet: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెట్రో రైల్ సర్వీస్ గుడ్ న్యూస్ తెలిపింది.

Metro Google Wallet: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెట్రో రైల్ సర్వీస్ గుడ్ న్యూస్ తెలిపింది. మెట్రో ప్రయాణికులకు డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకొని మరింత వేగవంతమైన సేవలను అందించేందుకు గూగుల్ వాలెట్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ. మెట్రో ప్రయాణికులు మరింత సులువుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుగా గూగుల్ వ్యాలెట్‌ను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు.

RCS చాట్‌తో మెట్రో టికెట్స్ కొనుగోలు చేయడానికి టికెట్స్‌ను గూగుల్ వాలెట్ ద్వారా స్కాన్ చేసి వీలు కల్పిస్తుందని ఎండీ పెర్కోన్నారు. గూగుల్ వ్యాలెట్ వలన ప్రయాణికులు క్యూ లైన్లలో నిలబడి టికెట్ కొనుగోలు చేసే ప్రయాస తప్పుతుందని తెలిపారు. ఎలాంటి యాప్ అవసరం లేకుండా గూగుల్ వ్యాలెట్ ద్వారా ఒక్క మెసెజ్‌తో మెట్రో టికెట్స్ బుక్ చేసుకొవచ్చు అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. మెట్రో రైలు విస్తరణ వల్ల హైదరాబాద్ నలుమూలల ఉన్న ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories