Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు ఖరారైన రూట్‌మ్యాప్‌

Hyderabad Metro Phase 2 Expansion Final Route Map Ready
x

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు ఖరారైన రూట్‌మ్యాప్‌

Highlights

Hyderabad Metro: మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకూ పొడగింపు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ ప్రతిపాదనలు ఖరారయ్యాయి. రెండో దశలో 70 కిలోమీటర్ల మేర నగరంలో మెట్రో పరుగులు పెట్టనుంది. గత ప్రభుత్వం సిద్ధం చేసిన పాత మెట్రో ప్రతిపాదనలు అన్నీ.. రద్దు చేస్తున్నట్టు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలల్లో డీపీఆర్‌లను సిద్ధం చేయాలని HMR ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది.

ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర మెట్రో నడుస్తుండగా.. దానికి అదనంగా మరో 70 కిలోమీటర్ల మేర మెట్రో పరుగులు పెట్టనుంది. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో రైల్ కొత్త రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. కొత్త ప్రతిపాదిత మెట్రో మార్గాల్లో మెజార్టీ ప్రయాణికులకు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రజలకు ప్రజా రవాణా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సిద్ధం చేసింది. కొత్త కారిడార్ల కోసం DPR ప్రక్రియ ప్రారంభమైంది. మరో మూడు నెలల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని అధికారులు చెప్తున్నారు.

ఫేజ్ 2 విస్తరణలో, సికింద్రాబాద్ జూబ్లీ‌బస్‌స్టేషన్ నుండి MGBS మధ్య మెట్రో రైలు నెట్‌వర్క్‌ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు పొడిగించనున్నారు. దీనికి తోడు నాలుగు కొత్త కారిడార్లలో మెట్రోరైలు నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. MGBS మెట్రో స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 7 కి.మీ, నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి LB నగర్ మెట్రో స్టేషన్ వరకు పొడగించనున్నారు. మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరామ్‌ఘర్ మీదుగా రాజేంద్ర నగర్ దగ్గర ప్రతిపాదిత హైకోర్టు వరకూ 4 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు.

రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్‌గూడ జంక్షన్, విప్రో జంక్షన్, మీదుగా.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలో మీటర్ల మెట్రో అందుబాటులోకి రానుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్‌చెరు వరకు 14 కిలో మీటర్ల మెట్రలో సిద్ధం కానుంది. LB నగర్ మెట్రో స్టేషన్ నుండి వనస్థలిపురం మీదుగా హయత్ నగర్ వరకు 8 కి.మీ మెట్రో రెడీ అవునుంది. అయితే... మెట్రో ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ వీటిని పబ్లిక్ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌లో నిర్మిస్తారా.. లేక పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories