Hyderabad Metro: హైద్రాబాద్ మెట్రో ప్రయాణీకులకు గుడ్ న్యూస్: స్టూడెంట్ పాస్ సహా మరో రెండు ఆఫర్లు 2025 వరకు పొడిగింపు

Hyderabad Metro
x

Hyderabad Metro

Highlights

Hyderabad Metro: హైద్రాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro Rail) ప్రయాణీకులకు అందిస్తున్న ఆఫర్లను (offers) 2025 మార్చి 31 వరకు పొడిగించింది ఆ సంస్థ.

Hyderabad Metro: హైద్రాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro Rail) ప్రయాణీకులకు అందిస్తున్న ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగించింది ఆ సంస్థ. ప్రస్తుతం అందిస్తున్న సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగిస్తున్నట్టు హైద్రాబాద్ మెట్రో (Hyderabad Metro) తెలిపింది.

ఈ ఏడాది అక్టోబర్ ఆరు నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజును వసూలు చేయనున్నారు. ప్రయాణీకుల సౌలభ్యం, భద్రతకోసమే ఈ రసుమును వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ తెలిపింది.

సూపర్ సేవర్ తో రోజంతా మెట్రోలో జర్నీ చేయవచ్చు. సెలవు రోజుల్లో రూ. 59 రోజంతా తిరిగొచ్చు. ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారంతో పాటు ప్రతి పండుగ రోజుల్లో ఈ అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories