Hyderabad: భాగ్యనగరం కాషాయమయం

Hyderabad is With Flexes and  BJP Flags
x

Hyderabad: భాగ్యనగరం కాషాయమయం

Highlights

Hyderabad: ఫ్లెక్సీలు, కటౌట్లతో హైదరాబాద్‌లో సందడి

Hyderabad: హైదరాబాద్‌లో బీజేపీ రెండోసారి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. 2004లో మొదటిసారి సమావేశాలు జరిగాయి. ఇప్పుడు రెండోసారి జరుగుతున్నాయి. అయితే అప్పట్లో బీజేపీ ఇక్కడ పెద్ద శక్తిగా లేదు. కానీ ఇప్పుడు బలమైన పార్టీగా పోటీలో ఉందటున్నారు కషాయ నేతలు. ఓటు బ్యాంకు గణనీయంగా పెంచుకుని ఏకంగా అధికారంపై కన్నేసింది. తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్‌కు బలంగా సవాల్ విసురుతోంది. 2014లో మోడీ వేవ్ మొదలయ్యాక.. ఆ బలం ఇంకా వేగంగా పెరిగింది.

ముఖ్యంగా గ్రేటర్‌లో కమలం పార్టీ కేడర్‌లో నయా జోష్‌ నెలకొంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీ అగ్రనేతలు హైదరాబాద్‌ను సందర్శిస్తు్న్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో గ్రేడర్‌ కేడర్‌లో నూతన ఉత్సాహం నెలకొంది. మరోవైపు భారీ ఫ్లెక్సీలు, స్థానిక నాయకులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, కన్వీనర్లు ఏర్పాటు చేసిన కటౌట్లు అగ్రనేతలకు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. అలాగే పరేడ్‌గ్రౌండ్స్‌ మైదానంలో రేపు నిర్వహించనున్న ప్రధాని బహిరంగ సభ సందర్భంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి.

ఈసారి తెలంగాణ ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం కూడా ఆ దిశగా సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇప్పటికే మోడీ, అమిత్ షా వీలైనప్పుడల్లా తెలంగాణ వస్తూ.. క్యాడర్లో జోష్ నింపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories