హైదరాబాద్ పరువుహత్య కేసులో పురోగతి.. నిందితులను కర్ణాటకలో పట్టుకున్న పోలీసులు

Hyderabad Honour Killing Accused Arrested in Karnataka | Live News Today
x

హైదరాబాద్ పరువుహత్య కేసులో పురోగతి.. నిందితులను కర్ణాటకలో పట్టుకున్న పోలీసులు

Highlights

Hyderabad: ప్రేమ వివాహం చేసుకున్నందుకే హత్య చేశారని పోలీసుల ప్రాథమిక అంచనా...

Hyderabad: హైదరాబాద్ షాహినాయత్‌గంజ్‌లో కులోన్మాద పరువుహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీరజ్ అనే యువకుడిని కిరాతకంగా హతమార్చిన ఆయన బావమరిదులు, స్నేహితులను కర్ణాటక గురుమిట్కల్‌లో వెస్ట్‌ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నీరజ్‌ను హత్య చేసిన సంజన కజిన్ బ్రదర్స్, వారి స్నేహితులు కర్ణాటక గురుమిట్కల్‌ కు పారిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి, హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ & శాహినాడ్ క్రైం & డీసీపీ పార్టీ క్రైమ్ టీమ్ నాలుగు టీంలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కోల్సావాడిలో ద్విచక్రవాహనంపై తాత జగదీష్ పన్వర్ తో కలిసి వెళ్తుండగా విచక్షణారహితంగా దాడి చేశారు. తాత జగదీశ్ పన్వర్ కళ్లముందే దారుణం జరిగింది. నీరజ్ తల మెడ ఛాతీ భాగంలో శరీరంపై 15 కత్తిపోట్లు పొడిచారు. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకే హత్య చేశారని పోలీసుల ప్రాథమిక అంచనా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories