Hyderabad Collector Tests Positive for Covid19: కరోనా బారిన పడిన హైదరాబాద్ కలెక్టర్..

Hyderabad Collector Tests Positive for Covid19: కరోనా బారిన పడిన హైదరాబాద్ కలెక్టర్..
x
Swetha Mohanty (File Phto)
Highlights

Hyderabad Collector Tests Positive for Covid19: తెలంగాణలో కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Hyderabad Collector Tests Positive for Covid19: తెలంగాణలో కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టెస్టులు పెరిగే కొద్దీ కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి కరోనా భారిన పడ్డారు. ఆమెకు పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కరోనా అనుమానంతో ఆమె గత ఐదు రోజులుగా కార్యాలయానికి విధులు నిర్వర్తించేందుకు రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కలెక్టర్ కు కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. కలెక్టర్‌తో పాటు.. డ్రైవర్‌కు, అలాగే కంప్యూటర్‌ ఆపరేటర్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో మొత్తం 15 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే రాష్ట్రంలో రోజుకు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 1,676 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలోనే అత్యధికంగా 788 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 224, మేడ్చల్‌లో 160 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి గురువారం ఒక్క రోజే 10 మంది మృతి చెందారు. కాగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నలభై వేలకు చేరువైంది. ఇప్పటివరకు 2,22,693 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories