Hawala: హవాలా వ్యాపార కేంద్రంగా మారిన హైదరాబాద్ సిటీ

Hyderabad City Has Become The Center Of Hawala Business
x

Hawala: హవాలా వ్యాపార కేంద్రంగా మారిన హైదరాబాద్ సిటీ

Highlights

Hawala: పోలీసులకు పట్టుబడిన సొమ్ము రాజకీయ నాయకులదేనా..?

Hawala: రానున్న ఎన్నికలే టార్గెట్‌గా హైదరాబాద్‌లో హవాలా వ్యాపారం మొదలయిందా..? ఎన్నికల కోడ్ మోగినప్పటి నుంచి తరుచూ హైదరాబాద్‌లో హవాలా డబ్బులు పట్టుబడుతుండంతో... ఈ వ్యవస్థ అంగడి సారుకుగా మారిందా..? ఎన్నికల వేళ హవాలా దందా ఎంత మేరకు నడుస్తుంది..? పోలీసులకు పట్టుబడ్డ సొమ్ము రాజకీయ నాయకులదా..? లేక.. వ్యాపారులదా..? హవాలా వ్యాపారం హైదరాబాద్ కేంద్రంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందా...? అంటే అవుననే అంటున్నారు.

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలు ఓ వైపు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం మరో వైపు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంపైనే దృష్టి సారించింది. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం ఒక్కో హవాలా రూపంలోనే సాధ్యమవుతుంది కాబట్టి... పలు రాజకీయ పార్టీల నేతలు హవాలాపైనే దృష్టి సారించారు. హైదరాబాద్ కేంద్రంగా ఓ ముఠా హవాలా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హవాలా ముఠాపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. హవాలా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరెవరు డబ్బును రవాణా చేస్తున్నారన్న దానిపై దృష్టి సారించి... రవాణా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

హైదరాబాద్ హవాలా రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. బేగంబజార్ నుంచి నిర్వహిస్తున్న హవాలా మనీ రాకెట్‌ గుట్టురట్టు చేశారు. హోండా యాక్టివాను అడ్డగించి, ఓ నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతడి నుంచి 18 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నరు. హవాలా డబ్బు రవాణా ప్రధాన ఏజెంట్ సవాయి శర్మ అలియాస్ సురేష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు సవాయి శర్మ అలియాస్ సురేష్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాడు. నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి రాంకోఠిలో స్థిరపడ్డారు.

బహదూర్‌పురాలో ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. హవాలా మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ మనీష్ అరోరాతో పరిచయం ఏర్పడి కొచ్చిన్, కేరళ నుంచి హవాలా నగదు బదిలీ వ్యాపారాన్ని రహస్యంగా నిర్వహిస్తున్నాడు. అవసరమైన కస్టమర్లకు ఒక లక్షకు 0.5 శాతం నుంచి 0.8 శాతం చొప్పున కమీషన్ ఆధారంగా డబ్బు సరఫరా చేస్తున్నాడు. ఈ దందాలో హవాలా బ్రోకర్లతో పరిచయాలు ఏర్పడి డబ్బుని చేరవేయడంలో ఎక్స్‌పర్ట్ అయ్యాడు సురేష్.

మెట్రో పాలిటన్ నగరాల్లో రూపాయి, పది రూపాయల నోట్లపై ప్రత్యేకమైన కరెన్సీ సీరియల్ నంబర్‌తో గుర్తింపు కోడ్‌ను నిర్వహిస్తారు. దీని ద్వారా అతడి వాట్సాప్ ఫోన్ ద్వారా సందేశాలు ఇతరులకు కమ్యూనికేట్ చేస్తూ హవాలా దందాను కొనసాగించాడు. ఆదాయపు పన్ను శాఖకు పన్ను ఎగవేసేందుకు హవాలా డబ్బు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సవాయి శర్మ హైదరాబాద్‌లోని పలు వ్యాపారుల నుంచి 18 లక్షల రూపాయలను మనీష్ సూచనలతో హవాలా లావాదేవీల ద్వారా మనీలాండరింగ్‌ కోసం తన హోండా యాక్టివాపై వెళ్తుండగా బేగంబజార్‌ ప్రాంతంలో పట్టుబడ్డాడు. నిందుతుడి నుంచి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..

కాగా సవాయి శర్మ కాంటాక్టు నంబర్లు, వాట్సాప్ డేటాను లిస్ట్ ఔట్ చేసి, ఎవరెవరితో పరిచాయలున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీలపై ఎన్నికల అధికారులు నిఘా ఉంచారు. రాజకీయ నాయకుల బ్యాంకు ఖాతాలు, ఇతర వ్యవహారాలకు సంబంధించి అన్ని ఖాతాలు ఎన్నికల అధికారులు పరిశీలనలో ఉంటాయి కనుక... ఎక్కువగా రాజకీయ నాయకులు హవాలా రూపంలో డబ్బును తెచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తారని ఆరోపణలున్నాయి. ఏ లెక్కా పత్రం లేకుండా డబ్బును తెచ్చి పంచడం, ఆర్థిక వ్యవహారాలు హవాలా ద్వారానే చేస్తారనే టాక్ ఉంది. ఎన్నికల అధికారులు, పోలీసులు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌తో పోలీసుల తనిఖీల్లో డబ్బు, మద్యం, బంగారు ఆభరణాలు, మత్తు పదార్ధాలు బయటపడుతున్నాయి.

ఎన్నికల వేళ రాజకీయ నాయకులు డబ్బు పంపిణీపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో.. పోలీసులు, ఎన్నికల అధికారులు కూడా డబ్బు పంపిణీని అరికట్టేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హవాలా దారులపైనే పోలీసులు దృష్టి సారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories