Hyderabad Central University: సెప్టెంబర్ 24 నుంచి హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు

Hyderabad Central University: సెప్టెంబర్ 24 నుంచి హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు
x
Hyderabad Central University (File Photo)
Highlights

Hyderabad Central University: వివిధ కోర్సుల్లో ప్రవేశానికి హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం.

Hyderabad Central University: వివిధ కోర్సుల్లో ప్రవేశానికి హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమవుతాయని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు బుధవారం విలేకరుల సమావేశం ద్వారా తెలిపారు. కోవిడ్-19 నిబందనలను, జాగ్రత్తలు తీసుకొని దేశంలోని 38 పరీక్షా కేంద్రాల్లో ప్రవేశ పరీక్షను ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తామని అప్పారావు తెలిపారు. ఇప్పటివరకు, వర్సిటీకి ఈ ఏడాది 62,583 దరఖాస్తులు వచ్చాయి అని.. వీటిలో తెలంగాణ నుండి 28,612 ధరక్స్తులు రాగా, కేరళ నుండి 7,019, ఆంధ్రప్రదేశ్ నుండి 4,250, ఢిల్లీ నుండి 5,082, పశ్చిమ బెంగాల్ నుండి 3,878, ఒడిశా నుండి 3,349 దరఖాస్తులు వచ్చాయి.

అయితే, వర్సిటీ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ (ARIIA) 2020 లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ సెంట్రల్ యూనివర్శిటీల టాప్ 10 జాబితాలో స్థానం సంపాదించింది. గత సంవత్సరం, విశ్వవిద్యాలయం జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది, కానీ ఆరు పడిపోయింది ఈ సంవత్సరం పదవ స్థానంలో ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories