CM KCR: కేసీఆర్‌కు హుస్నాబాద్ సెంటిమెంట్..

Husnabad Sentiment For KCR
x

CM KCR: కేసీఆర్‌కు హుస్నాబాద్ సెంటిమెంట్.. 

Highlights

CM KCR: భారీ ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ వర్గాలు

CM KCR: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది.హైదరాబాద్ నుంచి హుస్నాబాద్ సభ స్థలానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకుంటారు. సభలో పాల్గొని ప్రసంగించిన తర్వాత 5 గంటల 15 నిమిషాలకు తిరిగి హైదరాబాద్‌కు హెలికాప్టర్ ద్వారా వెళతారు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి భారీ బహిరంగ సభ కావడంతో జనం భారీగా చేరుకుంటున్నారు. సభలో మహిళలకు, వికలాంగులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు.

హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, మంత్రి హరీష్ రావు సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సభకు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ సందర్భంగా సభా స్థలం పక్కనే ఉన్న హుస్నాబాద్- కరీంనగర్, కరీంనగర్- హుస్నాబాద్ వెళ్లే దారి ట్రాఫిక్ ను మళ్లించారు.

హుస్నాబాద్ నియెజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 2014,2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి మొదటగా సభలు, సమావేశాలు, ప్రచారం మొదలు పెట్టడంతో రెండు సార్లు అధికారం చేపట్టారు. ఈసారి మళ్ళీ సెంటిమెంట్ పాటిస్తూ మళ్లీభారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ఎన్నికల శంఖారావం మోగించనున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే కాకుండా స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కూమార్ రెండు సార్లు విజయం సాధించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియెజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్ మొదటగా 2014,రెండోవసరి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలుపొందారు. మూడో సారి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సతీష్ కుమార్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికలో హుస్నాబాద్ లో వివిధ పార్టీల నాయకులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories