భార్యను వదిలించుకోవడానికి భర్త ప్లాన్‌.. స్కిన్‌ ఎలర్జీ ట్రీట్‌మెంట్‌ పేరుతో..

Husband Give Steroids to his Wife to Kill
x

భార్యను వదిలించుకోవడానికి భర్త ప్లాన్‌.. స్కిన్‌ ఎలర్జీ ట్రీట్‌మెంట్‌ పేరుతో..

Highlights

Nizamabad: నిజామాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యను వదిలించుకోవడానికి భర్త దారుణానికి పాల్పడ్డాడు.

Nizamabad: నిజామాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యను వదిలించుకోవడానికి భర్త దారుణానికి పాల్పడ్డాడు. స్కిన్‌ ఎలర్జీ ట్రీట్‌మెంట్‌ పేరుతో భార్య నరాలకు స్టెరాయిడ్స్‌ ఇంజక్షన్‌ ఇచ్చాడు. అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకోగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆర్మూర్‌ పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగింది బాధితురాలు. 2017లో గంగసాగర్‌, స్రవంతికి వివాహమైంది. వీరికి 4ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్న గంగసాగర్‌ నకిలీ క్లినిక్‌ పెట్టుకొని ఆర్‌ఎంపీగా చలామణి అవుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories