School Holidays: విద్యార్థులకు పండగలాంటి వార్త..జనవరిలో భారీగా సెలవులు

School Holidays: విద్యార్థులకు పండగలాంటి వార్త..జనవరిలో భారీగా సెలవులు
x
Highlights

School Holidays: ఇంకొన్ని రోజుల్లో 2025లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. జనవరి...

School Holidays: ఇంకొన్ని రోజుల్లో 2025లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. జనవరి నెలలో మళ్లీ వరుసగా సెలవులు వస్తున్నాయి. 2025 ఆరంభంలోనే భారీగా సెలవులు వచ్చాయి. ఈనెలలో మొత్తం 31రోజులు ఉండగా..అందులో 9 రోజులు సెలవులు వస్తున్నాయి. పాఠశాలలు, కాలేజీలకు ఈ 9 రోజులు సెలవులు ఉండనున్నాయి.దీంతో విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు.

జనవరి 2025లో కేవలం 22 రోజులు మాత్రమే పాఠశాలలు, కాలేజీలు తెరచి ఉంటాయి. జనవరి నెల ఆరంభమే అంటే జనవరి 1 కొత్త సంవత్సరం సెలవుతో ప్రారంభం కాబోతోంది. ఆ రోజు విద్యార్థులు ఇంటి దగ్గరి నుంచే కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవచ్చు.

ఇక జనవరి 5, 12, 19,26 తేదీల్లో సాధారణ సెలవులు ఉన్నాయి. ఈ 4 రోజులు ఆదివారాలు కావడంతో రెండు రాష్ట్రాల్లోని పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ఉంటుంది. ఇక ఎప్పటిలాగే జనవరి నెల సంక్రాంతి పండగ సెలవులు ఉన్నాయి. అయితే ఈసారి సంక్రాంతి సెలవులు ఆదివారం కలిసి రావడంతో వరుసగా సెలువులు వస్తున్నాయి. జనవరి 12 ఆదివారం సెలవు. ఆ వెంటనే జనవరి 13వ తేదీ సోమవారం భోగి సందర్భంగా సెలవు. ఆ తర్వాత జనవరి 14వ తేదీ మంగళవారం సంక్రాంతి సెలవు ఉంటుంది.

ఆ మరుసటి రోజు జనవరి 15వ తేదీ కనుమ హాలీడే. అదే రోజు హజ్రత్ అలీ బర్త్ డే సందర్భంగా కూడా విద్యార్థులకు ఆప్షనల్ హాలీడే ప్రకటించింది ప్రభుత్వం. దీంతో వరుసగా జనవరి 12 నుంచి 15వ తేదీ వరకు 4 రోజుల పాటు వరుసగా సెలవులు వస్తున్నాయి. మరోసారి ఇలా వరుస సెలవులు రావడం పైగా పండగ సమయం కావడంతో కొందరు పిల్లలతో కలిసి టూర్స్ ప్లాన్ చేస్తుండగా..ఇంకొందరు కుటుంబంతో కలిసి పొంతూళ్లకు పయనం అవుతున్నారు. దీంతో ఈ పండగవేళ బస్సులు, రైళ్ల జనాలతో సందడిగా మారుతాయి.

జనవరి 19వ తేదీన ఆదివారం, జనవరి 26వ తేదీ రిపబ్లికే డే జాతీయ సెలవు ఉంటుంద. కానీ ఆ రోజు ఆదివారం కావడంతో జనరల్ హాలీడే అయ్యింది. మొత్తం విద్యార్థులకు జనవరి నెలలో 9 రోజులు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories