Praja Bhavan: ప్రజావాణికి పోటెత్తుతున్న ప్రజలు

Huge Crowd At Praja Bhavan
x

Praja Bhavan: ప్రజావాణికి పోటెత్తుతున్న ప్రజలు

Highlights

Praja Bhavan: ఉదయం నుంచే ప్రజాభవన్‌కు క్యూ కడుతున్న జనం

Praja Bhavan: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణికి ప్రజలు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచే ప్రజాభవన్‌కు పోటెత్తుతున్నారు. దీంతో జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో ప్రజలు బారులు తీరారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ట్రాఫిక్ కు కూడా కొంత సమస్యగా మారింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుండటంతో వినతి పత్రాలను అందించి అధికారుల నుంచి హామీ పొందాలని ప్రజలు భావించి ఇక్కడకు వస్తున్నారు. దీంతో అక్కడ రద్దీ పెరిగింది. పోలీసులకు కూడా ప్రజావాణి కోసం వచ్చిన వారిని నియంత్రించేందుకు కష్టమైపోతుంది.

ప్రజాభవన్‌పై రద్దీ భారం పెరగడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. 8 తేదీ నుంచి తొలుత 30 సర్కిల్ కార్యాలయాల్లో.. 6 జోనల్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. సంక్రాంతి పండగ తర్వాత ఈ నెల 22 నుంచి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ప్రధాన కార్యాలయానికి రాలేని వారి కోసం.. ఉదయం పదిన్నర నుంచి.. పదకొండున్నర వరకూ ఫోన్ ఇన్ కార్యాక్రమం నిర్వహించనున్నారు. త్వరలోనే ఆ ఫోన్ నంబర్ అందుబాటులోకి తెస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories