గ్రేటర్‌లో ఇంతగా బీజేపీ ఎలా పుంజుకుంది?

గ్రేటర్‌లో ఇంతగా బీజేపీ ఎలా పుంజుకుంది?
x
Highlights

కారును ఢీకొట్టేంతగా దూసుకొచ్చింది. గులాబీని నలిపేసేంతగా తొడకొట్టింది. దుబ్బాక ఊపును గ్రేటర్‌ వైపు మళ్లించడంలో సక్సెస్‌ అయ్యింది. టీఆర్ఎస్‌, కాంగ్రెస్,...

కారును ఢీకొట్టేంతగా దూసుకొచ్చింది. గులాబీని నలిపేసేంతగా తొడకొట్టింది. దుబ్బాక ఊపును గ్రేటర్‌ వైపు మళ్లించడంలో సక్సెస్‌ అయ్యింది. టీఆర్ఎస్‌, కాంగ్రెస్, టీడీపీ కంచుకోటల్లో పాగా వేసింది. గతంకంటే ఎన్నో స్థానాలు పుంజుకుంది. బల్దియాలో అధికార పార్టీకి, ఒకరకంగా దడ పుట్టించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో, భారతీయ జనతా పార్టీ ఎంతోకొంత రైజ్‌ కావడానికి, అనుకూలించిన అంశాలేంటి?

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికలను ఆషామామాషీగా తీసుకోలేదు బీజేపీ. లోకల్‌ ఎలక్షన్స్‌ను లోక్‌సభ ఎన్నికల్లా క్రియేట్ చేసింది. మేయర్‌ సింహాసనం చేజిక్కించుకునేంతగా డివిజన్లు రాకపోయినా, గతంకంటే, ఎన్నోరెట్లు పుంజుకుంది బీజేపీ. గత ఎన్నికల్లో నాలుగు స్థానాలొస్తే, ఇప్పుడు వాటికంటే మరెన్నో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. గ్రేటర్‌లో బీజేపీకి కలిసొచ్చిన అంశాలు చాలా వున్నాయి.

దుబ్బాక ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ పెద్ద హడావుడి లేదు. దుబ్బాక బైపోల్ ఒక్కసారిగా దానికి ఎనలేని ఎనర్జీనిచ్చింది. అక్కడ గెలుపులో బీజేపీ పాత్ర కన్నా రఘునందన్‌నే ఎక్కువుంది. అయినా, టీఆర్ఎస్‌పై బీజేపీదే విజయమన్న ప్రచారం ఉధృతం చేసింది. కమలం ఏమాత్రం కోలుకోకూడదని, గులాబీ బాస్ వెంటనే గ్రేటర్‌ వార్‌కు సైరన్‌ మోగించినా, ఆ అవశాకాన్ని ఎంతోకొంత సద్వినియోగం చేసుకుంది కమలం. దుబ్బాక విజయాన్ని, గ్రేటర్‌‌ వైపు మళ్లించడంలో సక్సెస్‌ అయ్యిందన్నది, గెలిచిన స్థానాలనే బట్టే అర్థమవుతోంది.

స్టేట్‌, గ్రేటర్‌లోనూ టీఆర్ఎస్‌దే అధికారం. సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఏదో ఒక స్థాయిలో వుంటుంది. సర్కారుకు కర్రుకాచి వాతపెట్టాలనుకునే ఓటరుకు, ఒక ప్రత్యామ్నాయం కనపడాలి. కాంగ్రెస్‌‌‌ను ఆల్టర్నేటివ్‌గా భావించలేదు జనం. ఒకప్పుడు బల్దియాలో సత్తాచాటిన టీడీపీని అసలు ఆలోచించలేదు. ఈ రెండు పార్టీలు కాకుండా, మరో పార్టీ బీజేపీనే కనపడింది చాలామంది గ్రేటర్‌ ఓటర్లకు. ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలనుకున్న కేసీఆర్‌, కాంగ్రెస్‌, టీడీపీలను సర్వనాశనం చేశారు. అది బీజేపీకి కలిసొచ్చింది.

లోకల్‌ ఎలక్షన్స్‌‌ను లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లా ఫోకస్ చేసింది కాషాయం. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ గల్లీలకు బీజేపీ జాతీయ నాయకత్వం క్యూకట్టింది. కేంద్రమంత్రులు వచ్చారు. యూపీ సీఎం యోగి, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడణవిస్‌ బల్దియాలో ల్యాండయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షా, చివరి రెండురోజుల ప్రచారాన్ని హోరెత్తించారు. పనిలో పనిగా వ్యాక్సిన్‌ అంటూ, హైదరాబాద్‌లో పర్యటించి, బీజేపీకి ఇన్‌డైరెక్టుగా బలమిచ్చారు మోడీ. జాతీయ నాయకులంతా రావడంతో, దేశమంతా హైదరాబాద్‌ లోకల్‌ ఎన్నికల గురించే చర్చ జరిగింది. ఎప్పుడూలేనిది జాతీయ ఛానెల్స్ సైతం జీహెచ్‌ఎంసీ వార్‌ను రోజుల తరబడి కవర్‌ చేశాయి. జాతీయ అగ్రనాయకత్వం హడావుడి లోకల్‌ క్యాడర్‌కు బూస్టింగ్‌ ఇచ్చినట్టయ్యింది. దీనికి తోడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆయన దూకుడు కొంత మైనస్‌గా మారినా, పాతబస్తీలో మాత్రం ప్లస్‌గా మారిందన్న విశ్లేషణ జరుగుతోంది.

ఏ రాష్ట్రమైనా, ఏ ఎన్నికైనా బీజేపీ పాశుపతాస్త్రం సోషల్ ఇంజినీరింగ్. గ్రేటర్‌లోనూ ఇదే ఫార్ములా అప్లై చేసింది. బీహార్‌లో కాషాయాన్ని విజయతీరాలకు చేర్చిన భూపేందర్ యాదవ్‌‌కు, గ్రేటర్ ఎన్నికల ఇంచార్జీ బాధ్యతలను అప్పగించింది. హైదరాబాద్‌లో బలీయమైన వర్గాలైన యాదవ్‌, గౌడలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు భూపేందర్ యాదవ్. సీట్ల కేటాయింపుల్లోనూ కులాల సమీకరణను పక్కాగా చూసుకున్నారు.

బీజేపీ అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం హిందూత్వ. గ్రేటర్‌లోనూ అదే సంధించింది. టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీని టార్గెట్ చేసింది. టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో వుందంటూ గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ల వరకు అదేపనిగా విమర్శలు చేశారు. నిరంకుశ నిజాంపాలన సాగుతోందంటూ చెలరేగిపోయారు. రోహింగ్యాలు, పాతబస్తీ సర్జికల్ స్ర్టైక్స్, భాగ్యలక్షీ టెంపుల్‌ దగ్గర బండి సవాల్, అమిత్‌ షా పాతబస్తీ పర్యటన, ఇలా మతం ప్రాతిపదికన ఓట్ల చీలికకు, పోలరైజేషన్‌కు శతవిధాలా ప్రయత్నం చేసింది కాషాయం. ఇదే మైనస్‌గా మారినా, పాతబస్తీలో మాత్రం కొంత ప్లస్సయ్యింది. ఇదే నినాదాన్ని తెలంగాణ వ్యాప్తంగా మారుమోగించాలని భావిస్తోందట కమలం.

ఆల్‌ ఫ్రీ స్కీమ్స్‌ను వ్యతిరేకించే బీజేపీ, గ్రేటర్‌లో పాగా వేసేందుకు, టీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు చివరకు వాటినే ఆశ్రయించింది. బీజేపీకి మేయర్ పీఠం దక్కితే, సిటీ బస్సులు, మెట్రో ట్రైన్‌లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇంకా అనేక ఉచిత హామీలిచ్చింది. ఇవి కొన్ని డివిజన్లలో మహిళలను అట్రాక్ట్ చేశాయని ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఇవీ గ్రేటర్‌లో బీజేపీకి మునుపటి కంటే ఎక్కువ సీట్లు రావడానికి అనుకూలించిన అంశాల్లో కొన్ని.

Show Full Article
Print Article
Next Story
More Stories