Maa Elections: "మా"లో మళ్లీ మొదలైన రగడ

Hot Discussion on Movie Artist Association Elections
x

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Maa Elections: ఈసారి ఎన్నికలు ఉంటాయా? ఏకగ్రీవం చేస్తారా? * మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై హాట్ చర్చ

Maa Elections: "మా" లో మళ్లీ రగడ మొదలైంది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో మా ఎన్నికపై సర్వత్రా చర్చ జరగుతోంది. ఏకగ్రీవం చేయాలని కొందరు... ఎన్నికలు పెట్టాలని మరికొందరు వాదిస్తున్నారు. అయితే, ఈసారి స్టార్ యాక్టర్స్ పోటీలో నిల్చుంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోవు. అందుకే, సీనియర్‌ నరేష్ పదవీ కాలం ముగియడంతో ఫిల్మ్ సర్కిల్స్‌లో మా ఎలక్షన్స్‌పై వాడివేడి చర్చ జరుగుతోంది. అయితే, ఈసారి పెద్ద తలకాయలే పోటీపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్ పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, శివాజీరాజా, సీనియర్ నరేష్, జీవితా రాజశేఖర్, జయసుధలు అధ్యక్ష పదవికి పోటీపడతారని అంటున్నారు. అయితే, ఈసారి ఎన్నికలు ఉంటాయా? లేక ఏకగ్రీవం చేస్తారా? అనేది ఇండస్ట్రీ పెద్దల చేతుల్లో ఉంది. కానీ, పోటీకి సభ్యులు పట్టుబడితే మాత్రం ఎన్నికలు తప్పవు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఎన్నికల్లో సభ్యుల మధ్య ఇగోలతో ఎన్నో వివాదాలు, గొడవలు జరిగాయి. ఇక, ఒకే ప్యానెల్ నుంచి గెలిచిన సీనియర్ నరేష్‌, జీవితా రాజశేఖర్ మధ్య కూడా అభిప్రాయాలు భేదాలు వచ్చాయి. అందుకే, ఈసారి ఏకగ్రీవం చేయాలనే ఆలోచనను ఇండస్ట్రీ పెద్దలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవం కుదరకపోతే ఒక టర్మ్ మగవాళ్లకు మరో టర్మ్‌ మహిళలకు అవకాశం కల్పించాలని గతంలో చిరంజీవి, జయసుధ, మురళీమోహన్ ప్రతిపాదించారు. దాంతో, ఈసారి మహిళకే మా పీఠం దక్కే అవకాశం ఉందంటున్నారు.

మా ఎన్నికలపై వాడివేడి చర్చ జరుగుతున్నా, ప్రస్తుత పరిస్థితులు ఎలక్షన్స్ కి అనుకూలంగా లేవనే వాదన వినిపిస్తోంది. అయితే, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని కొందరు ప్రభుత్వ గైడ్ లెన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని మరికొందరు పట్టుబడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories