Constable Nagamani Murder Case: రంగారెడ్డి జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి చంపిన తమ్ముడు

Honor Killing In Hyderabad Lady Constable Hacked To Death By Her Own Brother
x

రంగారెడ్డి జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి చంపిన తమ్ముడు

Highlights

Constable Nagamani Murder Case: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు సమీపంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురయ్యారు.

Constable Nagamani Murder Case: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు సమీపంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురయ్యారు. మృతురాలు నాగమణి హయత్ నగర్ పోలీస స్టేషన్ లో పనిచేస్తున్నారు. నెల రోజుల క్రితం ఆమె కులాంతర వివాహం చేసుకున్నారు.

భర్త శ్రీకాంత్ తో కలిసి ఆమె హయత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఆమె తన స్వంత గ్రామం రాయపోల్ కు వెళ్లారు. రాయపోల్ నుంచి హయత్ నగర్ కు వస్తున్న సమయంలో ఆమె హత్య కు గురయ్యారని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ మీడియాకు చెప్పారు. నాగమణిని అతని సోదరుడు పరమేష్ హత్య చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే పూర్తివివరాలు తెలుస్తాయన్నారు. నాగమణికి గతంలో వివాహమైంది. భర్తకు విడాకులు ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ 1న యాదగిరిగుట్టలో శ్రీకాంత్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు.

ప్రేమ పెళ్లే హత్యకు కారణమా?

నాగమణి హత్యకు ప్రేమే పెళ్లే కారణమా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ తో నాగమణి పెళ్లిని కుటుంబ సభ్యులు ఎవరైనా వ్యతిరేకించారా.... అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు హయత్ నగరకు వెళ్తే వెళ్తున్న సమయంలో రాయపోల్ సమీపంలోనే హత్య చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆస్తి కోసమే హత్య?

ఆస్తి వివాదాలే నాగమణి హత్యకు కారణమనే అంశం తెరమీదికి వచ్చింది. పోలీసుల విచారణలో నాగమణి సోదరుడు పరమేష్ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారని తెలుస్తోంది. వారసత్వంగా వచ్చిన ఆస్తుల విషయమై పరమేష్, నాగమణి మధ్య వివాదం ఉంది. శ్రీకాంత్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తమ ప్రాణాలకు ముప్పుందని నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని కోరినట్టుగా సమాచారం. ఇదే విషయమై పెద్ద మనుషుల మధ్య పంచాయితీ కూడా నిర్వహించారని తెలుస్తోంది. ఈ సమయంలో పరమేష్ నాగమణిని బెదిరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవాళ హయత్ నగర్ కు వెళ్తున్న సమయంలో తన సోదరుడు పరమేష్ తనను అడ్డగించిన విషయాన్ని నాగమణి తన భర్త శ్రీకాంత్ కు ఫోన్ లో సమాచారం ఇచ్చారు. శ్రీకాంత్ ఈ విషయమై తన సోదరుడికి సమాచారం ఇచ్చారు. అతను ఘటన స్థలానికి చేరుకునే సమయానికి నాగమణి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories