హైదరాబాద్‌ను ఒక మినీ ఇండియాగా తీర్చిదిద్దుతాం : అమిత్‌షా

హైదరాబాద్‌ను ఒక మినీ ఇండియాగా తీర్చిదిద్దుతాం : అమిత్‌షా
x
Highlights

హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. నగర ప్రజలు బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా...

హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. నగర ప్రజలు బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. దారిపొడవుగా అంగుళం ఖాళీ లేకుండా తనకు స్వాగతం పలికిన హైదరాబాద్‌ వాసులకు ఆయన ధన్యవాదాలు తెలుపారు. రోడ్‌షోలో ప్రజల ఆదరణ చూశాక హైదరాబాద్‌ మేయర్‌ పీఠం బీజేపీదే అని నమ్ముతున్నట్లు చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో రోడ్‌షో నిర్వహించిన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచ దేశాలు ఆర్థికసంక్షోభం చిక్కుకున్నాయి. కానీ అదే సమయంలో భారత్‌కు ప్రధాని మోడీ పెట్టుబడులు తీసుకువచ్చారని కొనియాడారు. నవాబ్‌, నిజాం సంస్కృతులను తొలగించి, హైదరాబాద్‌ను మినీ ఇండియాగా తీర్చిదిద్దుతామని అమిత్‌షా అన్నారు.

ఎంఐఎం, టీఆర్ఎస్‌ పార్టీలు అంతర్గత పొత్తులు పెట్టుకొని నాటకం ఆడుతున్నాయని కేంద్ర హోంమంత్రి మండిపడ్డారు. పార్టీలు పొత్తులు పెట్టుకోవడం సహజం కానీ ఇలా రెండు పార్టీలు చీకటి ఒదం ఎందుకు చేసుకున్నాయని అమిత్‌షా ప్రశ్నించారు. అంతర్గతంగా స్నేహంగా ఉంటూ బయటికి విమర్శించుకోవడం ఎందుకని దుయ్యబట్టారు. ఎంఐఎం అండతోనే టీఆర్ఎస్‌ నాయకులు ఎన్నో అక్రమ నిర్మాణాలు నిర్మించారని విమర్శించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులిస్తోందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు నగర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. నగరంలోని నాలాలు, చెరువులపై అక్రమ కట్టడాలు ఉన్నాయని.. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని వాటిని కూల్చివేస్తామని స్పష్టం చేశారు. సిటీలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరితోనూ సమావేశం కాలేదని విమర్శించారు. తన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము వాగ్దానం చేశామంటే అమలు చేసి తీరుతామని అమిత్‌షా చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories