సొంతూళ్ళకు చేరుకుంటున్న వలస కూలీలు.. ఆందోళనలో పరిశ్రమల యాజమాన్యాలు

సొంతూళ్ళకు చేరుకుంటున్న వలస కూలీలు.. ఆందోళనలో పరిశ్రమల యాజమాన్యాలు
x
Highlights

వలస కూలీలు తమ స్వస్ధలాలకు వెళుతుండడం తో నిర్మాణ సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇన్నిరోజులు వీరి పైనే ఆధారపడిన ఈ రంగాలు...

వలస కూలీలు తమ స్వస్ధలాలకు వెళుతుండడం తో నిర్మాణ సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇన్నిరోజులు వీరి పైనే ఆధారపడిన ఈ రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయి. తెలంగాణలో నిర్మాణ రంగం పనులు మొదలాయ్యాయి, ఉపాధి దొరుకుతుందని అధికారులు చెబుతున్న వలస కార్మికులు వినిపించుకోవడంలేదు. సంగారెడ్డి జిల్లాలో వలస కార్మికుల సమస్యపై హెచ్ ఎం టీవీ స్పెషల్ రిపోర్టు.

లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి జిల్లాలో నిర్మాణ రంగం పనులు జోరుగా సాగేవి. పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్,కొల్లూరు, తెల్లాపూర్ లో భారీ నిర్మాణాలు జరగుతుండడంతో పాటు పరిశ్రమలు ఉండడంతో జార్ఖండ్, యూపీ, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది కూలీలు, కార్మికులు వలస వచ్చారు.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వలస కార్మికుల బతుకు తలకిందులైంది. పనులు నిలిచిపోవడంతో ఉపాధి కరవైంది. చేతుల్లో చిల్లిగవ్వలేకపోవడంతో బతుకు కష్టమయంగా మారింది. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వలస కార్మికులు రోడ్లపైకి వస్తుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

వలస కూలీలు తమ స్వస్ధలాలకు తరలి వెళుతుండడంతో నిర్మాణ సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కొన్నేళ్లుగా వీరి పైనే ఆధారపడిన ఈ రంగాలు ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనున్నాయి. కూలీలు, కార్మికులు లేకుంటే పనులు ఏలా జరుగుతాయని ఆందోళన చెందుతున్నాయి.

లాక్ డౌన్ నేపథ్యంలో దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నామని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లాపాటు తమతో పని చేయించుకున్న నిర్మాణ సంస్థలు, పరిశ్రమ యాజమాన్యాలు ఆదుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభం అవుతున్నా అందరికీ పని దొరికే పరిస్థితి లేదంటున్నారు.

కంపెనీలు, నిర్మాణ రంగం పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఉపాధి లభిస్తుండడంతో వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లరాదని కోరుతున్నారు. తప్పనిసరిగా సొంత రాష్ట్రాలకు వెళ్లే వారు వైద్య శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని, సొంత ఖర్చుల మీద ప్రయాణం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories