ఓఆర్‌ఆర్‌ అండర్‌పాస్‌ల్లో విద్యుత్ వెలుగులు

ఓఆర్‌ఆర్‌ అండర్‌పాస్‌ల్లో విద్యుత్ వెలుగులు
x
Highlights

సూర్యాస్తమయిందంటే చాలు సిటీ ఔట్ స్కర్ట్స్ లో కొన్ని ప్రాంతాల్లో అంతా చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి. దీంతో అటు వైపుగా వెలుతున్న చాలా మంది ప్రమాదాల బారినపడుతున్నారు.

సూర్యాస్తమయిందంటే చాలు సిటీ ఔట్ స్కర్ట్స్ లో కొన్ని ప్రాంతాల్లో అంతా చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి. దీంతో అటు వైపుగా వెలుతున్న చాలా మంది ప్రమాదాల బారినపడుతున్నారు. ఎంతో మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది నవంబర్ 27వ తేదీన హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు తొండుపల్లి టోల్‌గేట్‌ ప్లాజా సర్వీసు రోడ్డు వద్ద 'దిశ'పై అత్యాచారం చేసారు.

అనంతరం ఆమె మృతదేహాన్నిచటాన్‌పల్లి అండర్‌పాస్‌ వద్ద నిర్ధాక్షిన్నంగా కాల్చివేసారు. దీంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంతో విద్యుత్ దీపాలు ఉంటే అంతటి ఘోరం జరిగి ఉండేది కాదని ఎంతో మంది అధికారులకు తెలిపారు. దీంతో హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ విభాగాధికారులు ఓ నిర్ణయానికొచ్చారు.

హెచ్‌ఎండీఏ అనుబంధ విభాగమైన హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) ఓఆర్‌ఆర్‌ విభాగాధికారులు మేల్కొన్నారు. దీంతో ఆ సమయంలో హెచ్‌జీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్న హరిచందన దాసరి ఎల్‌ఈడీ, సౌర లైట్లను రోడ్డుకిరువైపులా పెట్టాలని ఆదేశాలు జారీ చేసారు. ఆయన ఆదేశాలతో డిసెంబర్‌లో ఓఆర్‌ఆర్‌ అండర్‌పాస్‌లలో ఎల్‌ఈడీ, సౌర లైట్లు అమర్చేందుకు టెండర్లు పిలిచారు. దీంతో నగరంలో అన్ని ప్రదేశాలలో లైట్లను ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ బుధవారం నుంచి అన్నిచోట్లా ఈ వెలుగులు విరజిమ్ముతాయని అధికారులు చెబుతున్నా, కొన్నిచోట్లా మాత్రం ఇంకా పనులు పూర్తికాలేదని కిందిస్థాయి సిబ్బంది అంటున్నారు. ఇక పోతే ఈ విద్యుధ్దీకరణ పనులను దాదాపుగా రూ.1.90 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఇందులో భాగంగానే 158 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఓఆర్‌ఆర్‌కు ఉన్న 165 అండర్‌పాస్‌ వేలలో విద్యుద్దీపాలను అమర్చ నున్నారు. ఈ లైట్లను అమర్చడం ద్వారా ఎంతో మందికి మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుందని అధికారులు తెలిపారు. దాంతో పాటుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా తగ్గిపోతుందని ప్రయాణికులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories