Ananthapadmanabha Swamy Temple Vikarabad : అనంత పద్మనాభ స్వామి అంటే మనకు గుర్తొచ్చే ఆలయం కేరళ అనంత పద్మనాభుడే.
Ananthapadmanabha Swamy Temple Vikarabad : అనంత పద్మనాభ స్వామి అంటే మనకు గుర్తొచ్చే ఆలయం కేరళ అనంత పద్మనాభుడే. కానీ మన తెలంగాణలో కూడా రెండు అనంత పద్మనాభ స్వామి ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి. అందులో ఒకటి వికారాబాద్‌లో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ దేవాలయాన్ని హిందూ మతానికి చెందిన రాజులు కాకుండా ముస్లిం రాజు నిర్మించడం విశేషం. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వికారాబాదు సమీపంలో ఉంది. దీనిని అనంతగిరి అనంతపద్మనాభ స్వామి దేవాలయం అని అంటరు. యిది హైదరాబాద్‌కి 75 కిలో మీటర్ల దూరంలో, వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలసింది.
చరిత్ర
స్కంద పురాణం ప్రకారం ఈ దేవాలయం ద్వాపర యుగంలో "మార్కండేయ" ఋషి నిర్మించాడని ప్రతీతి. ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరనానికి ఆరర్షితుడైన మార్కండేయ ముని అనంతగిరి కొండలలో యోగ సాధన చేయుటకు సంకల్పిస్తాడు. ప్రతి రోజూ మార్కండేయ ముని తన యోగ సాధనతో అనంతగిరి నుండి కాశీ వెళ్ళి గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేవాడు. ఒక రోజు ఉదయం ప్రాతః కాలంలో ద్వాదశి ప్రవేశించుట వలన ఆయన కాశీకి వెళ్లలేకపోతాడు. శివుడు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి ఆయనకు గంగా జలాన్ని స్నానమాచరించుటకు ఏర్పాట్లు చేస్తాడు.
రాజర్షి ముచికుందుడు అనేక సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి అనంతగిరిలో విశ్రాంతి తీసుకొనుటకు వచ్చి పూర్తి నిద్రలోనికి వెళ్తాడు. ఆయన దేవేంద్రుని ద్వారా "ఎవరు ఆయన నిద్రాభంగం కలిగిస్తారో వారు అగ్నికి ఆహుతి అవుతారు" అనే వరాన్ని పొంది యున్నాడు.
కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకా నగరాన్ని చేరుకుని కృష్ణుడు, బలరాములను తీసుకుని అనంతగిరి ప్రాంతానికి వచ్చి ముచికుందుని నిద్రాభంగం కలిగించి ఆయన మరణిస్తాడు. కృష్ణుడు ముచికుందునకు "అనంత పద్మనాభస్వామి" రూపంలో దర్శనమిస్తాడు. కృష్ణుడు ముచికుందునికి శాశ్వత స్థానం ప్రపంచంలో కల్పించుటకు ఒక నది రూపం అనుగ్రహిస్తాడు. అదే నది ప్రస్తుతం మూసీ నదిగా పిలువబడుతుందని ప్రజల నమ్మకం.
స్వామి చరిత్ర
ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ప్రాంతం భక్తులను ఎంతగానో ఆకర్శిస్తోంది. కొండలు, దట్టమైన అడవితో కూడిన ఈ ప్రాంతం కనువిందు చేస్తూ ఉంటుంది. ప్రతీనిత్యం ఇక్కడకు వచ్చే భక్తులకు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం సుమారు 1300 సంవత్సరంలో నిర్మించి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. దట్టమైన అడవి, కొండలు, గుహలతో రుషులు తపస్సు చేసుకోవటానికి అనుకూలంగా ఉండే ఈ ప్రాంతంలో ముచుకుందుడనే అనే రాజర్షి ఇక్కడ తపస్సు చేశారు.
శ్రీకృష్ణ బలరామ దేవుళ్లు ప్రత్యక్షం కాగా, ముచుకుందుడు సంతోషించి వారి పాదాలను కడిగి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ముచుకుందుని చేత శ్రీ కృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనదిగా మారిందని కథనం. అనంతగిరి కొండల్లో పుట్టిన ముచుకుందా నది కాలక్షికమేణా మూసీ నదిగా మారింది. అనంతగిరిలో పుట్టి జిల్లాలో పారుతూ హైదరాబాద్ మీదుగా నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో మూసీ కలుస్తోంది. అనంత పద్మనాభస్వామి దేవాలయానికి మరో కథనం కూడా ఉంది. కలియుగ ప్రారంభంలో మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఃఫలముగా సాలక్షిగామ రూపంలో అనంతపద్మనాభుడిగా అవతరించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది.
పాపనాశనం
దేవాలయం పక్కనే ఉన్న భగీరథ గుండంలో స్నానం చేస్తే పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. దేవాలయానికి వచ్చే భక్తులు ముందుగా భవనాశిని అని పేరున్న భగీరథ గుండంలో స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ భగీరథ గుండంలో స్నానం ఆచరిస్తే కోర్కెలు తీరడమే కాకండా సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం.
జాతరలు
ప్రతీ సంవత్సరం రెండు సార్లు ఇక్కడ జాతరను నిర్వహిస్తారు. ఈ కార్యక్షికమంలో జిల్లా ప్రజలేకాకుండా ఇతర రాష్ట్రాల వారు పెద్ద ఎత్తున పాల్గొంటారు. కార్తీక పౌర్ణమికి రథోత్సవంతో పాటు,11 రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలకు జిల్లాకు చెందిన ప్రజలే కాకుండా పరిసర జిల్లాలైన హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్‌ల నుంచి తరలివస్తారు. ఇక్కడ తరచుగా సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire