High Tension At Gandhi Bhavan: గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత

High Tension At Gandhi Bhavan: గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత
x
Highlights

High Tension At Gandhi Bhavan: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ...

High Tension At Gandhi Bhavan: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులతో పాటు ఇతర నాయకులు గాంధీ భవన్ నుంచి గుర్రం బండి మీద గుర్రాలమీద బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నాయకులను గాంధీభవన్ గేటు దాటగానే అడ్డుకున్నారు.

అనంతరం పోలీసులే కాంగ్రెస్ నాయకులను హైదరాబాద్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు లోనికి తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన వారిలో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నా రెడ్డి, పిసిసి కార్యనిర్వహణ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ లు ఉన్నారు. మిగిలిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు గాంధీభవన్ కే పరిమితం చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories