Heat Wave: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

High Temperature in two Telugu States
x

Representational Image

Highlights

Heat Wave: పలు జిల్లాల్లో మండే ఎండలు, వడగాలులు * 12 - 3 గంటల మధ్య మరీ ప్రమాదకరం

Heat Wave: భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. భానుడి భగభగలకు జీవజాతులు అల్లాడిపోతున్నాయి. సెగలుకక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏప్రిల్‌ ప్రారంభంలోనే మండే ఎండలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, పండ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు. రానున్న మూడురోజులూ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని

హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రత 40 నుంచి 43 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకే వెళ్లవద్దని అధికారులు సూచించారు. 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ఎండ అధికంగా ఉంటుందని, ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య తీవ్రత అధికమని, విదర్భ నుంచి వడగాలులు వీయనున్నాయని అధికారులు హెచ్చరించారు.

మంచిర్యాల, పెద్దపల్లి, జయశంక ర్‌ భూపాలపల్లి, ములుగు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని హెచ్చరించారు. చిన్న పిల్లలను బయటకు పంపించవద్దని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories