హైదరాబాద్‌లో అరుదైన సర్జరీ..ఔరా అనిపించిన వైద్యులు

హైదరాబాద్‌లో అరుదైన సర్జరీ..ఔరా అనిపించిన వైద్యులు
x
Highlights

వైద్యులు అంటేనే ప్రాణం పోసే దేవుల్లు అని అంటారు అందరూ. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైద్యులు రోగికి వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడతారు. అదే...

వైద్యులు అంటేనే ప్రాణం పోసే దేవుల్లు అని అంటారు అందరూ. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైద్యులు రోగికి వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడతారు. అదే క్రమంలో హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో ఓ రోగికి అత్యంత అరుదైన, సవాల్‌తో కూడిన శస్త్రచికిత్స చేసి ఆయన ప్రాణాలను కాపాడారు వైద్యులు. అసలు ఆయన ఎవరు ఆయనకి ఏం వైద్యం అందించారు పూర్తివివరాల్లోకెళితే సయ్యద్‌ ఇషాక్‌ అనే 71 సంవత్సరాల వయసు కలిగిన ఓ వ్యక్తికి కేర్ ఆస్పత్రిలో వైద్యులు బహుళ బైపాస్‌ సర్జరీలను చేసి ఔరా అనిపించారు. హైదరాబాద్‌‌లోని కేర్‌ హాస్పిటల్స్‌‌లో ఈ సర్జరీని ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్‌ ప్రతీక్‌ భట్నాగర్‌ బృందం విజయవంతంగా నిర్వహించింది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా జీవించి ఉన్న కాలేయదాతకు విజయవంతంగా 'హై రిస్క్‌ బీటింగ్‌ హార్ట్‌ బైపాస్‌' శస్త్రచికిత్స చేసినట్లు కేర్‌ హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు.

ఇక పోతే 1998వ సంవత్సరంలో సయ్యద్‌ ఇషాక్ అనే వ్యక్తి తన కాలేయంలోని ఎడమ వైపు భాగాన్ని తన సోదరునికి దానం చేశారు. అనంతరం ఆయన కొద్ది రోజుల వరకు అందరిలాగానే సాధారణ జీవితాన్ని అనుభవించారు. కొన్నేండ్లు గడిచిన తరువాత ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చాయి. దీంతో ఆయన 2000, 2010, 2012 సంవత్సరాలలో పుణెలో కరోనరీ ఆర్టరీస్‌కు స్టెంటింగ్‌ చేయించుకున్నారు. అప్పుడు వైద్యులు ఆయనకు ఆరు స్టెంట్‌ల వేసారు. అప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉన్న ఆయనకు ఇటీవలనే గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటనే కరోనరీ యాంజియోగ్రఫీ సూచించారు.

ఈ టెస్టులో ఆయనకు వేసిన స్టెంట్‌లలోనూ బహుళబ్లాక్స్‌ ఉన్నాయని తేలింది. దీంతో వైద్యులు ఆయనకు అత్యవసరంగా బైపాస్‌ శస్త్రచికిత్స చేయాల్సి ఉందని నిర్ణయించారు. ఆ తరువాత అక్టోబర్‌ 1న డాక్టర్‌ ప్రతీక్‌ భట్నాగర్‌ నేతృత్వంలోని బృందం బహుళ బైపాస్‌ శస్త్రచికిత్సలను బీటింగ్‌ హార్ట్‌ విధానాన్ని అనుసరించి మొత్తం ధమనులను వ్యాప్తి చేశారు. అయితే ఈ వైద్యవిధానంలో కాళ్లకు ఎలాంటి కోతలనూ చేయలేదు. శస్త్రచికిత్స జరిగిన రెండు రోజులలోనే ఆయన తిరిగి నడవడం ప్రారంభించారు. ఆయన పరిస్థితి పూర్తిగా మెరుగుపడటంతో సయ్యద్‌ను బుధవారం డిశ్చార్జ్‌ చేశారు.

ఇక ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రతీక్‌ భట్నాగర్‌ మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సలో ప్రధానమైన అంశం కాలేయ పనితీరు అని ఆయన అన్నారు. బీటింగ్‌ హార్ట్‌ శస్త్రచికిత్స విధానాన్ని కాలేయ పనితీరును దృష్టిలో ఉంచుకుని అనుసరించినట్లు చెప్పారు. దీంతో ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సను నిరోధించడంతో పాటుగా మొత్తం బైపాస్‌ శస్త్రచికిత్సను గుండెను ఆపడం లేదా కోత లేకుండా చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories