తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి మిల్క్ ఏటీఎం

తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి మిల్క్ ఏటీఎం
x
Highlights

ప్రజల అవసరాలు తీర్చేందుకు ATMలు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటి వరకూ మనం మనీ ఏటీఎం, వాటర్ ఏటీఎం, ఎయిర్ ఏటీఎంలను చూశాం. ఆ జాబితాలో మరో ఏటీఎం...

ప్రజల అవసరాలు తీర్చేందుకు ATMలు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటి వరకూ మనం మనీ ఏటీఎం, వాటర్ ఏటీఎం, ఎయిర్ ఏటీఎంలను చూశాం. ఆ జాబితాలో మరో ఏటీఎం వచ్చి చేరింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన సుభాష్‌ ఈ ఆవిష్కరణ చేశాడు. ఎంతో శ్రమించాడు. చాలా మందికి ఉపయోగపడేలా యంత్రాన్నితీర్చిదిద్దాడు. ఇంతకీ సుభాష్‌ తయారు చేసిన ఆ కొత్త ఏటీఎం ఎలా రూపుదిద్దుకుంది. ఈ మిషన్‌ వల్ల ఎవరికి ఉపయోగం కలగనుంది ?

జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రస్తుతం సెంటర్‌ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఎనీ టైం మిల్క్ ఏటీఎం మిషన్‌ అక్కడ ఏర్పాటయింది. మొదటిసారి మిల్క్‌ ఏటీఎం అందుబాటులోకి రావడంతో జనాలు భారీగా తరలివస్తున్నారు. మెట్‌పల్లికి చెందిన సుభాష్‌ మిల్క్ ఏటీఎంను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఈ మిల్క్ ఏటీఎం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాల ఏటీఎం యజమాని. సుభాష్ తెలిపాడు. మొట్ట మొదటిసారిగా మెట్ పల్లిలో ప్రారంభం చేశామని వినియోగదారులు ఆశీర్వాదం అందిస్తే మరిన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభిస్తామని తెలిపాడు.

సాధారణంగా పాలు కావాలంటే డబ్బులు చెల్లించి తీసుకోవాలి కానీ ఈ యంత్రం లో నోట్లను పెడితె పాలు వాటికవే వస్తాయి. ఏదో రకంగా నూతన ప్రయోగాలు చేయాలని అనుకున్న సుభాష్ అందులో భాగంగా ఎనీ టైం మిల్క్ ఏటిఎంను కొనుగోలు చేశాడు. ఇది సాధారణంగా ఎన్ని లీటర్ల పాలు కావాలంటే సరిపడే డబ్బులు మిషన్‌లో పెట్టి పాలను పట్టుకోవాలి. ఇలా ఎవరికి ఎన్ని లీటర్ల పాలు కావాలంటే అంత డబ్బులు చెల్లించాలి. మిల్క్ ఏటీఎంలో స్వచ్ఛమైన గేదె పాలు మాత్రమే ఇక్కడ లభిస్తాయి. సులువైన పద్ధతిలో పాలను అందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మెట్ పల్లి పట్టణ ప్రజలు.

మెట్ పల్లికి చెందిన సుభాష్‌ తనకు వచ్చిన ఆలోచనలతో గత 6 నెలలుగా ఢిల్లీలో తనకు ఇష్టమైన రీతిలో ఈ మిషన్‌ను తయారు చేయించుకున్నాడు. 500 లీటర్ల కెపాసీటి కలిగిన ఈ మిషన్ సుమారు 4 లక్షల వ్యయంతో తయారు చేయించాడు. ప్రతీ రోజు గ్రామీణ ప్రాంతాల నుండి పాలను తీసుకువచ్చి అందులో నింపుతాడు. డబ్బులు మిషన్‌లో ఉంచి ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్ల పాలు మిల్క్‌ ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. మిల్క్ ఏటీఎం ద్వారా చాలా సులువుగా పాలను తీసుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు సుభాష్ చేసిన సరికొత్త ప్రయోగానికి హట్సాఫ్ చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories