నమ్మించి మోసం చేశారు.. వారిని వదలొద్దు : హేమంత్ భార్య అవంతి

నమ్మించి మోసం చేశారు.. వారిని వదలొద్దు :  హేమంత్ భార్య అవంతి
x

Hemanth Wife Avanthi

Highlights

Hemanth Wife Avanthi : హైదరాబాద్ లోని చందానగర్ లో పరువుహత్య కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. చందానగర్ కి చెందిన హేమంత్ అవంతి అనే అమ్మాయిని గత ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు..

Hemanth Wife Avanthi : హైదరాబాద్ లోని చందానగర్ లో పరువుహత్య కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. చందానగర్ కి చెందిన హేమంత్ అవంతి అనే అమ్మాయిని గత ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు.. ఈ విషయం సదరు యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ అమ్మాయికి గత కొంతకాలంగా ఇంట్లోనే నిర్బంధించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో జూన్‌ 10వ తేదీన వారిద్దరూ బయటకి వచ్చి బీహచ్‌ఈఎల్‌ సంతోషీమాత ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

అయితే నిన్న(గురువారం) 3 గంటల సమయంలో యువతి బంధువులు మరియి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్‌ ఇంటికి వచ్చి వారిని బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లారు. అందులో హేమంత్ భార్య అవంతి తప్పించుకోగా, హేమంత్ ని తీసుకువెళ్ళారు. ఈ క్రమంలో హేమంత్ తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపడుతున్న క్రమంలో హేమంత్‌ శవమై కనిపించాడు. అయితే దీనికి అవంతి తండ్రి, వారి బంధువులే కారణం అని హేమంత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

దీనిపైన హేమంత్ భార్య అవంతి స్పందిస్తూ.. తమని నమ్మించి మోసం చేశారని, ఇంతటి దారుణానికి పాల్పడిన తన తల్లిదండ్రులతో పాటుగా మరికొందరిని కూడా వదలొద్దని అవంతి చెప్పుకొచ్చింది. తన అత్తమామల భాద్యత తనదే అంటూ చెప్పుకొచ్చింది. ఇందులో మొత్తం 13 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, రంజీత్ రెడ్డితో పాటుగా మరికొందరి పైన కేసులు నమోదు అయ్యాయి..

అటు హేమంత్ తండ్రి మాట్లాడుతూ.. అసలు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్టుగా తమకి తెలియదని చెప్పుకొచ్చారు. ఇలా అని తెలిస్తే ముందుగా ఒప్పుకునేవాడిని కాదని, ఎందుకంటే దీనివలన వచ్చే అనర్ధాలను హేమంత్ కి చెప్పేవాడిని అని హేమంత్ తండ్రి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పెళ్లి అయ్యాక అవంతి పేరు పైన ఉన్న ఆస్తులను కూడా ఆమె తండ్రి పేరు మీదికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని అయన వెల్లడించారు. అటు కులం కారణంగానే తన కొడుకుని చంపారని హేమంత్ తల్లి చెప్పుకొచ్చారు.



Show Full Article
Print Article
Next Story
More Stories