Nowhera Shaik: తెలంగాణలో పార్టీ పెడతాను అన్న తర్వాతే అరెస్ట్ చేశారు..

All The Charges Against Me Were Cleared In The Supreme Court
x

Nowhera Shaik: నాపై మోపిన అభియోగాలు అన్నీ సుప్రీంలో తేలిపోయాయి

Highlights

Nowhera Shaik: నేను రూ.5 వేల కోట్ల డిపాజిట్లు సేకరించలేదు

Nowhera Shaik: తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన తర్వాత మూడు రోజులకే అరెస్ట్ చేశారని హీరా గోల్డ్ అధినేత్రి నౌహీరా షేక్ ఆరోపించారు. తాను రాజకీయ పార్టీ పెడితే తమకు నష్టం జరుగుతుందని మజ్లిస్ పార్టీ భావించిందన్నారు. తాను ఎక్కడికీ పారిపోవడం లేదని కస్టమర్లు అందరికీ డబ్బులు డిపాజిట్ చేస్తామని తెలిపారు. 5 వేల కోట్లు సేకరించాననేది అవాస్తవమన్న నౌహీరా.. సీసీఎస్ తన దర్యాప్తులో కేవలం 13 లక్షలకు మాత్రమే ఆధారాలు చూపారని చెప్పుకొచ్చారు. హీరా గోల్డ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు నౌహీరా షేక్.

మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలపై 300 కోట్లకు పైగా ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. కొద్ది రోజుల క్రితమే 78 కోట్ల 63 లక్షలు స్థిరాస్తిని ఈడీ అటాచ్ చేసింది. అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు రూపంలో హీరా గోల్డ్ నగదు సేకరించింది. సేకరించిన నగదును నిర్మాణ రంగ సంస్థలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో సీసీఎస్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను ఛాలెంజ్ చేశానని నౌహీరా షేక్ తెలిపారు. సుప్రీంకోర్టు లో సైతం తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఈడీ తనను కొన్ని డాక్యుమెంట్లు అడిగిందని వాటిని ఇవ్వడానికి ఈడీ ఆఫీస్ కు వచ్చానని నౌహీరా షేక్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories