Hyderabad: సంక్రాంతికి సొంతూళ్లకు నగరవాసులు..హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీ రద్దీ
Hyderabad: సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ - విజయవాడ రహదారి భారీగా రద్దీ పెరిగింది. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కొత్తగూడెం ...
Hyderabad: సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ - విజయవాడ రహదారి భారీగా రద్దీ పెరిగింది. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చౌటుప్పల్ పతంజలి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిబ్బంది 10 టోల్ బూతుల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. అటు హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు.
చౌటుప్పల్ కూడలిలో అండర్ పాస్ నిర్మాణాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. నేడు, రేపు రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. రద్దీ దృష్ట ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. ఎంబీబీఎస్, జేబీఎస్, దిల్ షుక్ నగర్ బస్టాండ్, ఎల్బీనగర్ కూడలి వద్ద రద్దీ పెరిగింది.
దిల్ షుక్ నగర్ నుంచి చౌటుప్పల్ కు ఒక గంటలో చేరుకోవచ్చు. కానీ గతేడాది బోగి కి ముందు రోజు మూడు నాలుగు గంటల సమయం పట్టింది. ఈసారి పండుగకు అదే స్థాయిలో రాకపోకలు సాగే అవకాశం ఉంది. దీని నిజం చేస్తూ శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహన రద్దీ మొదలైంది. పతంగి టోల్ ప్లాజా ఇరువైపులా కలిపి 16 టోలు బూతులు ఉండగా.. విజయవాడ మార్గంలోని 10ని తెరవడం గమనార్హం. శని, ఆదివారాల్లో ఈ రద్దీ మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. పైగా ఆదివారం చౌటుప్పల్లో సొంత ఉంటుంది. అప్పుడు హైవేపై వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. రాకపోకలకు ఇప్పటికే సమస్యగా మారింది. వీటన్నిటిని కారణంగా సంక్రాంతి వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.
ఇక హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్ పల్లి, అద్దంకి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుంటారు. మీరు విజయవాడ వస్తే హయత్ నగర్ అబ్దుల్లాపూర్మెట్ చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా ప్రత్యామ్నాయంగా కొంత దూరం పెరిగిన హైదరాబాద్ నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రయాణికులు ఓఆర్ఆర్ పైనే పైకి వెళ్లి బొంగులూరు గేటు వద్ద ఎగ్జిట్ తీసుకొని నాగార్జునసాగర్ హైవేలోకి వెళ్ళిపోతే సరిపోతుంది. సికింద్రాబాద్ ,తార్నాక, ఉప్పల్ మీదుగా నేరుగా భువనగిరికి వెళ్లవచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire