Weather Forecast Today: * ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ * పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు
Weather Forecast Today: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని చెప్పారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire