మళ్లీ పెరుగుతున్న గోదావరి..అప్రమత్తమవుతున్న అధికారులు

మళ్లీ పెరుగుతున్న గోదావరి..అప్రమత్తమవుతున్న అధికారులు
x
గోదావరి ఉధృతి
Highlights

Godavari Water Level Today : రెండు రోజుల క్రితం ఉగ్రరూపం దాల్చి 61 అడుగులు దాటి సమీప గ్రామాలను, పంట పొలాలను ముంచెత్తిన భద్రాచలం గోదావరి నిన్న సుమారు 19 అడుగులు తగ్గింది.

Godavari Water Level Today : రెండు రోజుల క్రితం ఉగ్రరూపం దాల్చి 61 అడుగులు దాటి సమీప గ్రామాలను, పంట పొలాలను ముంచెత్తిన భద్రాచలం గోదావరి నిన్న సుమారు 19 అడుగులు తగ్గింది. దీంతో అధికారులు చుట్టు పక్కన గ్రామాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుని ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. కానీ ఎగువ ప్రాంతాల్లో బుధవారం నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల్లో, అదే విధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి గురువారం ఉదయం నుంచి మళ్లీ పెరుగుతుంది. దీంతో అధికారులు, చుట్టు పక్కన గ్రామాలప్రజలు అప్రమత్తమవుతున్నారు.

గురువారం ఉదయం 5 గంటలకు గోదావరి 42.6 అడుగులు వరకు ఉండగా కేవలం రెండు గంటలు గడిచేలోపే గోదావరి నీటిమట్టం 43.1 అడుగులకు చేరింది. దాంతో అధికారులు ఉపసంహరించుకున్న మొదటి ప్రమాదహెచ్చరికను మళ్లీ జారీ చేసారు. మరో మూడు గంటలు గడిచేసరికి అంటే గురువారం ఉదయం 10గంటల వరకు గోదావరి నీటి మట్టం 44.8 అడుగులకు చేరింది. ఇదే విధంగా వరద కొనసాగితే భద్రాచలంలో గోదవారి ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇక పోతే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్న క్రమంలో అధికారులు నీటి మట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అదే విధంగా 53 అడుగుల వరకు నదీ ప్రవాహం దాటితే మూడో ప్రమాద హెచ్చరిక అదే విధంగా చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇక పోతే అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో శనివారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు నిండు కుండలా మారాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు పంటలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. కొన్ని గ్రామాలన్నీ జలదిగ్బంధంలో ఉండిపోయాయి. అదే విధంగా రోడ్లపై వరద నీరు రావడంతో రాకపోకలు కూడా ఎక్కడికక్కడ స్థంబించిపోయాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories