Heavy Rains in Nizamabad : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు

heavy damage to crops in nizamabad
x

నిజామాబాద్ జిల్లాలో నీట మునిగిన పంటలు (ఫోటో ది హన్స్ ఇండియా )

Highlights

* నీటిలోనే వందలాది ఎకరాలు * కన్నీరు మున్నీరవుతున్న రైతన్నలు * సోయా, మొక్కజొన్న, పెసర, మినుము పంటకు భారీ న‌ష్టం

Heavy Rains in Nizamabad : భారీ వర్షాలు రైతన్నలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాలు తగ్గి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ వందల ఎకరాల్లో పంటలు నీటిలోనే మునిగి ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 40శాతం, నిజామాబాద్ జిల్లాలో 33శాతం పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాధమిక నివేదిక సర్కారుకు పంపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంటలు చేతికందకుండా పోయాయి. సోయా, మొక్కజొన్న, ఆపరాలు పంటలు చేతి కందే దశలో వర్షార్పణం కావడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని బోధన్, రెంజల్ మండలాలలో పంట నష్టం తీవ్రంగా ఉంది. రెంజల్ లో 15వందల 66 ఎకరాలు, బోధన్‌లో 16వందల 33 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. భీంగల్, వేల్పూర్, చందూర్ మండలాల్లో కలిపి మూడొందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదిక సర్కారుకు పంపించారు వ్యవసాయ అధికారులు. దాదాపు మూడు కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు నివేదికలు పంపారు. మరోవైపు భారీ వర్షాలకు 30కి పైగా ఇళ్ళు దెబ్బతినగా ట్రాన్స్‌ఫార్మర్లు. ప్రధాన రహదారులు కోతకు గురయ్యాయి.

ఇక కామారెడ్డి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. వారం రోజులు పాటు ఏకధాటిగా వర్షాలు కురిసాయి. ఫలితంగా చేతికందే సమయంలో పంట నీట మునిగింది. జిల్లా వ్యాప్తంగా 40 శాతం పంటలు నష్టాన్ని మిగిల్చాయి. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద, పెద్ద కొడపగల్, పిట్లం మండలాల్లో పెసర, మినుము, పంటకు నష్టం వాటిల్లింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డి పెద్ద చెరువు బ్యాక్ వాటర్ తో తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి శివారులో సుమారు మూడు వందల ఎకరాల పంట నీట మునిగింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories