హైదరాబాద్ పురానా పూల్‌ వంతెనకు పగుళ్లు

హైదరాబాద్ పురానా పూల్‌ వంతెనకు పగుళ్లు
x
Highlights

హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరమంతా అల్లకల్లోలం అయింది. భారీ వర్షాలకు నగరంలోని చెరువులు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో...

హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరమంతా అల్లకల్లోలం అయింది. భారీ వర్షాలకు నగరంలోని చెరువులు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా నగరంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు పూర్తిగా మూసీలోకి చేరడంతో మూసీ పొంగి పొర్లుతోంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ముంపు భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఒక్కసారిగా వరద నీరు చేరి మూసీ ఉగ్రరూపం దాల్చడంతో పూరానాపూల్‌లో నదిపై ఉన్న వంతెనకు పగుళ్లు వచ్చాయి. ఈ సమాచారం అందుకోగానే జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వంతెన నుంచి రాకపోకలు నిలిపివేశారు. వారం రోజుల్లో రెండు సార్లు హైదరాబాద్‌లో వర్షం కురిసింది. రికార్డ్‌ స్థాయిలో కురిసిన వర్షానికి వరద మూసీని ముంచెత్తింది. జియాగూడ, కార్వాన్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పూరానాపూల్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ వైపు మళ్లిస్తున్నారు. కాగా, వంతెన పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక టెక్నికల్‌ టీంను రప్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు మూసీ నదికి ఇరువైపుల రెయిలింగ్ ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మూసీ రివర్ బోర్డు ఛైర్మెన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే డ్రోన్ కెమెరాలతో ప్రస్తుతం ఉప్పొంగుతున్న మూసీ నదిని మొత్తం చిత్రీకరిస్తున్నామని తెలిపారు. నదికి ఇరువైపులా రెయిలింగ్ దాని ఆధారంగానే ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని సుధీర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎడతెరపిలేకుండా వర్షం కురవడంతో వరద ప్రవాహం ఎక్కువ ఉందని, దీంతో మూసీ నది ఎక్కువ ప్రవహిస్తుందని వారు తెలిపారు.

మూసీకి ఇంతటి వరద రావడం ఇది రెండోసారి అని భవిష్యత్తులో మూసీ ప్రవాహంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మూసికి ఇరువైపులా పటిష్టమైన రెయిలింగ్ నిర్మించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. మూసీ నదిలో వరద పోటెత్తడంతో చాదర్‌ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జిలు దెబ్బతిని వుంటాయని సుధీర్ రెడ్డి చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం నిపుణల కమిటీ అధ్యాయం చేస్తుందని చెప్పారు. మూసి ప్రవాహం తగ్గిన తర్వాత నదిపై ఉన్న బ్రిడ్జిల కండిషన్ చెక్ చేసి రాకపోకలు పునరిద్దిస్తామని ఆయన చెబుతున్నారు. వరద తగ్గితేగానీ వాటి పరిస్థితి ఏంటన్నది అంఛనా వేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రెయిలింగ్ నిర్మాణం వల్ల నది ఆక్రమణలు తగ్గుతాయని, అదే సమయంలో వరద పోటెత్తినా జనావాసాల్లోకి వరద నీరు రాదని ఆయన వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories