హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy Rain In Hyderabad | TS News
x

హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Highlights

Hyderabad Rain: రోడ్లపై భారీగా నిలిచిన నీరు.. వాహనదారుల ఇబ్బందులు

Hyderabad Rain: హైదరాబాద్ తడిసి మద్దయింది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు భారీగా నిలిచింది. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారుల ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు పొడి వాతావరణం ఉన్నా.. ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్, లక్డీకపూల్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, అసెంబ్లీ, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్‌పురా, అత్తాపూర్, మణికొండ, నార్సింగి, కాటేదాన్, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, జియాగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, బోలక్పూర్, కవాడీగూడ, గాంధీనగర్, జవహర్ నగర్, రాంనగర్, దోమలగూడ, చార్మినార్, బహదూర్ పురా, చాంద్రాయణగుట్ట, బార్కాస్, ఫలక్ నుమా, ఉప్పుగూడ, రామాంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కురవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు తిరిగి వెళుతున్న ఉద్యోగులు, వాహనదారులు వర్షంలో తడిపోయారు. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకి మోకాళ్ల లోతు వరదనీరు చేరడంతో వాహనదారులతోపాటు పాదచారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నగరంలో కురిసిన భారీ వర్షానికి అంబర్‌పేటలోని మూసారాంబాగ్‌ వంతెన నీట మునిగింది. లోతట్టు ప్రాంతం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన వరద నీరు మొత్తం మూసారాంబాగ్‌ వంతెన పైకి చేరింది. దీంతో వంతెన నీట మునిగింది. వంతెనకు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను గోల్నాక వంతెన మీదుగా దారి మళ్లించి సహాయక చర్యలు చేపట్టారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Show Full Article
Print Article
Next Story
More Stories