దసరా సందర్భంగా పల్లెబాట పడుతున్న పట్టణం

దసరా సందర్భంగా పల్లెబాట పడుతున్న పట్టణం
x
Highlights

దసరా సందర్భంగా పట్టణం పల్లెబాట పడుతోంది. భాగ్యనగరవాసులు తమ తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లోని...

దసరా సందర్భంగా పట్టణం పల్లెబాట పడుతోంది. భాగ్యనగరవాసులు తమ తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాప్‌లన్నీ రద్దీగా మారాయి. గత ఏడాదితో పోలిస్తే కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది పండుగకు వెళ్లే వారి సంఖ్య కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది.

సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ దగ్గర ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాప్‌ అంతా సందడిగా మారింది. మరోవైపు పండగ సందర్భంగా 3వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు ప్రయాణించేలా చర్యలు చేపట్టింది. ప్రయాణిలకు రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని బస్సు సర్వీసులు నడిపేందుకు బస్సులను సిద్ధం చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories