Sriram Sagar Project: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌‌కు జలకళ.. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీ వరద

Heavy Flood With Heavy Rains In The Upper Reaches
x

Sriram Sagar Project: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌‌కు జలకళ.. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీ వరద

Highlights

Sriram Sagar Project: ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌కు లక్ష 16వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

Sriram Sagar Project: ఉత్తర తెలంగాణ వరప్రసాదాయని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌ జలకళ సంతరించుకుంది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర నుంచి, ఎస్సారెస్పీ క్యాచ్ మెంట్ ఏరియాలో భారీగా ఇన్ ఫ్లో చేరుతుంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో నిండుకుండలా మారింది. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌కు లక్ష 16వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, నిల్వ సామర్థ్యం 90టీఎంసీల గాను 72 టీఎంసీలకు చేరింది. 1091 అడుగులకు గాను 1085 అడుగులు చేరింది. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో ఈ సారి పంటలకు డోకా లేదని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories