Heatwave: భానుడు ప్రచండ నిప్పులు..నగరంలో పదేళ్ల తర్వాత రికార్డ్ ఉష్ణోగ్రతలు

Heat wave conditions
x

నగరంలో పదేళ్ల తర్వాత రికార్డ్ ఉష్ణోగ్రతలు

Highlights

Heatwave:మార్చి నెలలో పెరిగుతున్న ఉష్ణోగ్రతలు

Heatwave:భానుడు ప్రచండ నిప్పులు చెరుగుతున్నాడు. ఇంతకాలం చలితో అల్లాడిపోయిన జనం ఇక ఎండ వేడిమిని తట్టుకునేందుకు సిద్ధం కాకతప్పదు.. గతవారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. ఉదయం 7గంటలకే ప్రారంభమవుతున్న ఎండలు.. 11 దాటితే భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీనికి తోడు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువైపోయింది. సమ్మర్ స్టార్టింగ్‌లోనే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు..

శివరాత్రి రానే రాలేదు.. ఎండలు మండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి సమ్మర్ మరింత హీట్‌గా ఉండనుంది. హైదరాబాద్‌లో ఒక్కరోజే అధికంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. అయితే ఈ సారి వేసవిలో వడగాలులతో పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఏడాది 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎండలతో చిన్నారుల దగ్గర నుంచి వృద్దుల వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత పదేళ్ల తర్వాత నగరంలో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సారి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగే అవకాశ ఉండొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖలో పాటు వైద్య శాఖ ప్రజలను ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటున్నారు. ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ఆ సమయంలో బయటకు వెల్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఎడాది భానుడి భగభగలు అధికంగా ఉంటాయనే విషయం స్పష్టం అవుతుంది. నిపుణుల సూచనల ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందనంటున్నారు..


Show Full Article
Print Article
Next Story
More Stories