తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రోలో గుండె తరలింపు..

తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రోలో గుండె తరలింపు..
x

తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రోలో గుండె తరలింపు..

Highlights

గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా మెట్రోరైలును వినియోగించనున్నారు. అపోలో హాస్పిటల్‌ వైద్యుడు గోకులే నేతృత్వంలో జరిగే శస్త్ర చికిత్స కోసం...

గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా మెట్రోరైలును వినియోగించనున్నారు. అపోలో హాస్పిటల్‌ వైద్యుడు గోకులే నేతృత్వంలో జరిగే శస్త్ర చికిత్స కోసం గుండెను మెట్రో రైలులో తరలిచించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్య‌క్తికి అమ‌ర్చ‌నున్నారు.

జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌రో వ్య‌క్తికి గుండె మార్పిడి శ‌స్ర్త‌చికిత్స‌కు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్ట‌ర్ గోకులే నేతృత్వంలో ఈ శ‌స్ర్త‌చికిత్స నిర్వ‌హించ‌నున్నారు. ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి గుండెను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 3 గంట‌ల మ‌ధ్య‌లో త‌ర‌లించ‌నున్నారు. నాగోలు మెట్రో స్టేష‌న్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వ‌ర‌కు గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories