High Court: గవర్నర్ కోటా MLCల పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

Hearing on Governor Quota MLCs petition in High Court today
x

High Court: గవర్నర్ కోటా MLCల పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ 

Highlights

High Court: నిన్న సుదీర్ఘంగా సాగిన వాదనలు

High Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నిక వివాదంపై ఇవాళ హైకోర్టు మరోసారి విచారించనుంది. ఈ పిటిషన్‌పై నిన్న ఉదయం నుండి హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరగగా.. కోర్టు తదుపరి విచారణను రేపటికి ఇవాళ్టికి వేసింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికపై స్టేటస్ కో రేపటి వరకు హైకోర్టు పొడగించింది.

నామినేటేడ్ కోటాలో బీఆర్ఎస్ నేతలు నేతలు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల ఎన్నికను గతంలో గవర్నర్ తమిళి సై నిరాకరించారు. దీంతో వీరు గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కేబినెట్ ఆమోదించినప్పటికీ తమ నియామకంలో గవర్నర్ తన అధికార పరిధికి మించి వ్యహహరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ ఎన్నికపై క్లారిటీ వచ్చే వరకు నామినేటేడ్ కోటా నియామకాలపై స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎన్నికపై కోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories