ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Hearing in High Court on MLA Rohit Reddy Writ Petition
x

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Highlights

High Court: ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన రోహిత్‌రెడ్డి

High Court: తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ రోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్‌లో నలుగురిని ప్రతివాదులుగా చేర్చారు రోహిత్ రెడ్డి ఈసీఐఅర్ నమోదుపై రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మనీ లాండరింగ్ జరగనప్పుడు ఈసీఐఅర్ నమోదు చేయడం విరుద్ధమని వాదించారాయన... మెయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో ఎక్కడా డబ్బు దొరకలేదని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అలాంటప్పుడు ఈడీ ఎలా ఎంటర్ అయిందని నిరంజన్ రెడ్డి వాదించారు. పార్టీ మారితే 100 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారని హైకోర్టుకు నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాగా ఈసీఐఅర్ నమోదు చేస్తే అభ్యంతరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈడీ పరిధిపై కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను నిరంజన్ రెడ్డి వినిపించారు. కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. కేసు దర్యాప్తును హైకోర్టు సీబిఐకి అప్పగించిందని హైకోర్టుకు విన్నవించారు నిరంజన్ రెడ్డి.. అయితే ఈ కేసు తదుపరి విచారణ జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories