TS Driver Constable 2022: తెలంగాణ డ్రైవర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకి అప్లై చేశారా.. !

Have you Applied for Telangana Driver Constable Posts
x

TS Driver Constable 2022: తెలంగాణ డ్రైవర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకి అప్లై చేశారా.. !

Highlights

TS Driver Constable 2022: తెలంగాణ డ్రైవర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకి అప్లై చేశారా.. !

TS Driver Constable 2022: తెలంగాణలో ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 100 డ్రైవర్‌ కానిస్టేబుల్‌ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టుల కోసం.. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. లేదా పదో తరగతి, ఐటీఐలో ఆటో ఎలక్ట్రీషియన్‌ లేదా మెకానిక్‌ మోటార్‌ లేదా మెకానిక్‌ డీజిల్‌ లేదా ఫిట్టర్‌ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక టెక్నికల్‌ క్వాలిఫికేషన్‌ విభాగంలో తప్పనిసరిగా లైట్‌ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌తో బ్యాడ్జ్‌ నంబర్‌ కలిగి ఉండాలి. లేదా హెవీ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి, రెండేళ్ల పాటు డ్రైవింగ్‌ చేసిన అనుభవం ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్‌ విషయానికి వస్తే తెలంగాణ డ్రైవర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకి ప్రిలిమినరీ ఉండదు. ముందుగా ఈవెంట్స్ అంటే రన్నింగ్‌, లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లలో ఉత్తీర్ణ త సాధించాలి. తర్వాత 100 మార్కులకి డ్రైవింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో పాస్‌ అయినవారు మెయిన్స్‌కి ఎంపికవుతారు. డ్రైవర్‌ కానిస్టేబుల్‌ పేపర్ తెలుగులో ఉండదు. కేవలం ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఇందులో వచ్చిన మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత చివరలో మెడికల్‌ టెస్ట్ ఉంటుంది. అయితే డ్రైవర్‌ కానిస్టేబుల్‌ పోస్టులు అనేవి స్టేట్‌ లెవల్‌ పోస్టులు. మెరిట్‌ ఆధారంగా తెలంగాణలో ఎక్కడైనా ఉద్యోగం రావచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories