Gaddar Family: ఉద్యమాలు తప్ప కుట్రలు తెలియని గద్దర్ కుటుంబం కాంగ్రెస్ ట్రాప్ లో పడిందా...?

Has Gaddar Family fallen in Congress Trap
x

Gaddar Family: ఉద్యమాలు తప్ప కుట్రలు తెలియని గద్దర్ కుటుంబం కాంగ్రెస్ ట్రాప్ లో పడిందా...?

Highlights

Gaddar Family: కాంగ్రెస్ పార్టీకి గద్దర్ కుటుంబం పట్ల చిత్తశుద్ది ఉంటే గద్దర్ ప్రాబల్యం ఉన్న రూరల్ నియోజికవర్గాలలో స్థానం కల్పించ వచ్చు..

Gaddar Family: కాంగ్రెస్ పార్టీకి గద్దర్ కుటుంబం పట్ల చిత్తశుద్ది ఉంటే గద్దర్ ప్రాబల్యం ఉన్న రూరల్ నియోజికవర్గాలలో స్థానం కల్పించ వచ్చు. మిలటరీ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు & ఆరవ మాల 42% ఉన్న కంటోన్మెంట్ ఏరియాలో గద్దర్ లెగసీని గుర్తించేది ఎవరు ?

గద్దర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన రాజకీయ లబ్దికోసం వాడుకుంటుంది. క్యాడర్ లేకుండా బలహీనంగా ఉన్న కంటోన్మెంట్ టికెట్ కేటాయింపు అంటే అవుననే అనిపిస్తుంది. మరో శంకరమ్మల మారనున్న వెన్నెల రాజకీయ భవిష్యత్తు. గద్దర్ కుటుంబంపై కాంగ్రెస్ కు అంత ప్రేమ ఉంటే MLC కానీ వరంగల్ ఎంపీ టికెట్ కానీ ఇవ్వొచ్చు కదా..

గద్దర్ చనిపోయినపుడు అంతా తానై చూసుకున్న పిసిసి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారికి తెలియదా.. కంటోన్మెంట్ లో టికెట్ ఇస్తే వెన్నెల ఓడిపోతుందని. తను ఎంపీగా పోటీ చేసినప్పుడే కంటోన్మెంట్ అసెంబ్లీలో BRS కి లీడ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తె తానే సీఎం అవుతా అంటున్న రేవంత్ రెడ్డి గారు గద్దర్ కుటుంబానికి తన కేబినెట్ లో చోటు కల్పించొచ్చు లేదా నామినేటెడ్ MLC / MP ఇవ్వొచ్చు కదా... ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన నామ మాత్రపు పోటీగా శ్రీకాంత చారి కుటుంబానికి BRS టికెట్ ఇచ్చి శంకరమ్మ ఓటమికి కారణమైంది.

హుజూర్ నగర్ టికెట్ విషయంలో కెసిఆర్ పైన ఉద్యమ కారులు, తెలంగాణ మేధావి సమాజం తీవ్ర విమర్శలు చేశారు. శంకరమ్మ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా BRS పార్టీ చిత్త శుద్దిన ప్రశ్నించింది. ఇప్పుడు గద్దర్ ఫ్యామిలీ రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలాంటి తప్పే చేస్తుందా..?

Show Full Article
Print Article
Next Story
More Stories