Harish Rao: తెలంగాణలో వరద సహాయక చర్యలపై హరీష్‌రావు ట్వీట్

Harish Rao tweeted about flood relief operations in Telangana
x

Harish Rao: తెలంగాణలో వరద సహాయక చర్యలపై హరీష్‌రావు ట్వీట్

Highlights

Harish Rao: ప్రజలు కష్టాల్లో ఉన్నారు, సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు

Harish Rao: తెలంగాణలో వరద సహాయక చర్యలపై మాజీ మంత్రి హరీష్‌రావు.. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేశారు. రాష్ట్రంలో కుండ‌పోత‌గా కురిసిన వ‌ర్షాల‌కు ప్రజలు కష్టాల్లో ఉన్నారని, సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఇంట్లో వరద నీరు.. క‌ళ్లల్లో ఎడతెగని కన్నీరు ప్రవ‌హిస్తుంద‌న్నారు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని హరీష్‌రావు ఆవేద‌న వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడంపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని హ‌రీశ్‌రావు సూచించారు.

ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలని, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. అసలే రాష్ట్రం విష జ్వరాలతో విలువిలలాడుతున్నది. వరదల వల్ల మరింత విజృంభించే ప్రమాదం ఉంది. అన్ని శాఖలు అప్రమత్తం కావాలి. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories