Harish Rao: హామీలపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి

Harish Rao Tweet On Congress Govt Manifesto Implementation In Telangana
x

Harish Rao: హామీలపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి

Highlights

Harish Rao: దసరాకు ఊళ్లకు వస్తున్న యువతతో చర్చించండి

Harish Rao: గతేడాది దసరాకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి ఓటేసిన యువత ఆలోచించాలని ఎక్స్ వేదికగా కోరారు మాజీమంత్రి హరీష్ రావు. గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదంటూ విమర్శించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని.... పది నెలలు గడిచినా అతీ గతి లేదన్నారు.

దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ ‌- బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించాలని యువతను కోరారు హరీష్ రావు. మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీల అమలు.. రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లపై నిలదీయాలన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories