Harish Rao: లగచర్ల ఘటన తరువాతే ఆ పేరు మార్చారు.. మరి గెజిట్ సంగతేంటి?

Harish Rao: లగచర్ల ఘటన తరువాతే ఆ పేరు మార్చారు.. మరి గెజిట్ సంగతేంటి?
x
Highlights

Harish Rao about Industry corridor at Lagacherla: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలను ముడిపెడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు పలు...

Harish Rao about Industry corridor at Lagacherla: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలను ముడిపెడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని, అందుకే ఇకనైనా కాంగ్రెస్ పార్టీ మారాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలో జరిగిన లగచర్ల ఉదంతాన్ని హరీష్ రావు ప్రస్తావించారు. నేతలు ఎవ్వరూ లగచర్ల వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయిందన్నారు.

లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జులై 19న గెజిట్ విడుదల చేశారు. ఇటీవల లగచర్లలో ఘర్షణల అనంతరం ఫార్మా సిటీ కాదు.. పారిశ్రామిక కారిడార్ అని చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఒకవేళ పారిశ్రామిక కారిడార్ మాట వాస్తవమే అయితే, ముందుగా ఫార్మా సిటీ పేరుతో ఎందుకు గెజిట్ విడుదల చేశారని హరీష్ రావు ప్రశ్నించారు. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్న మాట వాస్తవమే అయితే, ముందుగా విడుదల చేసిన గెజిట్ నోట్ ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories