Harish Rao: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు?

Harish Rao Open Letter To CM Revanth Reddy
x

Harish Rao: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు?

Highlights

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు బహిరంగ లేఖ

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు దాటినా.. ఆర్టీసీ విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డే ప్రకటించలేదని లేఖలో తెలిపారు. ఆర్టీసీని విలీనం చేసే అపాయింటెడ్ డేను అమలు చేయాలని హరీష్‌రావు కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన నాడే.. ఆర్టీసీ విలీనంపై జీవో విడుదల చేస్తారని కార్మికులు ఆశించారని, నేటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ప్రభుత్వంలో విలీనం చేస్తూ తక్షణం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మహిళలకు ఉచిత బస్సు పథకంతో డ్రైవర్లు, కండక్టర్లపై పనిభారం పెరిగిందన్నారు. కనీసం మార్చి నెల నుంచైనా.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇవ్వాలని, అలాగే.. పెరిగిన రద్దీకి అనుగుణంగా.. కొత్త బస్సులు కొనుగోలు చేయాలని లేఖలో సీఎం రేవంత్‌ను హరీష్‌రావు కోరారు. 2013 PRC బాండ్స్‌కు పేమెంట్‌ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, బాండ్స్‌కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలని గుర్తుచేశారు హరీష్‌రావు. అదనపు బస్సులు సమకూర్చే విషయంలోనూ, PRC బాండ్స్ చెల్లించే విషయంలోనూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే చొరవ చూపాలని లేఖలో కోరారు హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories